పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ఈ నెల 10వ తేదీనుంచి 17 వరకు రోజూ రాత్రి 1 గంట నుంచి తర్వాత రోజు ఉదయం 10 గంటల వరకు స్పెషల్ షోలు వేసే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి.. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. సినిమా విడుదలైన వారం రోజుల పాటు 24 గంటలూ ప్రదర్శించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం గమనార్హం.
ప్రభుత్వ అనుమతి వల్ల.. సినిమా విడుదలైన తొలి రోజునే చూడాలనుకునే అభిమానులలో ఎక్కువ మంది కోరిక నెరవేరడానికి అవకాశం ఉంది. తొలి వారం మొత్తం సుమారు 25 షోలు రాష్ట్రమంతటా అదనంగా వేయడం ద్వారా నిర్మాతలు లాభపడతారు.