అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు

0 0
Read Time:2 Minute, 35 Second

కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల ప్రజలను బీసీ జాబితాలో చేరుస్తూ వారికి అదనంగా 5 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అంతకు ముందు మంత్రివర్గం లాంఛనంగా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి మరీ ఈ అంశంపైనే చర్చ చేపట్టారు. ప్రభుత్వం తరపున బీసీ వర్గానికి చెందిన మంత్రి కింజరాపు అచ్ఛెన్నాయుడు సభలో బిల్లును ప్రవేశపెట్టారు.

తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకే కాపు రిజర్వేషన్లను అమల్లోకి తెస్తున్నట్టు మంత్రి చెప్పారు. తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య బీసీలను రోడ్లపైకి రావాలని పిలుపునివ్వడాన్ని ప్రస్తావించిన అచ్ఛెన్న… ఎందుకు రావాలని ప్రశ్నించారు. బీసీలకు నష్టం జరగని విధంగా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీ-ఎఫ్ కేటగిరిలోకి చేరుస్తున్నామని అచ్ఛెన్నాయుడు చెప్పారు. బలహీనవర్గాలకు అన్యాయం జరిగేట్లయితే తానే ముందుకొచ్చి పోరాడతానన్నారు.

కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాల్లో ఉన్న పేదరికం ప్రాతిపదికనే రిజర్వేషన్లను ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకున్నామంటూ… ప్రజా సాధికార సర్వే వివరాలను చదివి వినిపించారు. పేదరికం, విద్య, ఉద్యోగాలలో ఆయా కులాల స్థానాన్ని మంత్రి వివరించారు. బీసీ కమిషన్ రాష్ట్రమంతటా తిరిగి అభిప్రాయాలను సేకరించిందన్నారు. ప్రతిపక్షం ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తోందని మంత్రి విమర్శించారు. శాసనసభ, శాసనమండలిలో ఆమోదం పొందిన బిల్లును గవర్నర్ కు పంపిస్తామని తెలిపారు. అసెంబ్లీలోని తెలుగుదేశం, బిజెపి శాసనసభ్యులు ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply