అమరావతి అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లపై లండన్ నగరంలో జరిగిన రెండు రోజుల వర్కుషాపు ముగిసింది. హైకోర్టు డిజైన్ కు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీకి మాత్రం తుది రూపును ఖరారు చేయలేదు. అసెంబ్లీకోసం నార్మన్ ఫోస్టర్ రూపొందించిన 13 డిజైన్లలో రెండు తుది పరిశీలనకు రాగా…ఆ రెంటినీ మేళవించి తుది రూపును తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
చతురస్రాకార నమూనాను, పెద్ద టవర్ ఉన్న నమూనాను సమ్మిళితం చేసి మరింత అందమైన డిజైన్ తయారు చేయాలన్న సూచనతో లండన్ వర్క్ షాపు ముగిసింది. రెండు రోజుల చర్చల్లో ముఖ్యమంత్రితో పాటు ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రాష్ట్ర మంత్రులు యనమల, నారాయణ, సలహాదారు పరకాల ప్రభాకర్ఏ తదితరులు పాల్గొన్నారు.
పై ఫొటోలో టవర్ నమూనా, ఇన్సెట్ లో చతురస్రాకార నమూనాను చూడొచ్చు. ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన హైకోర్టు నమూనా దిగున ఉంది. అందులోనూ కొన్ని మార్పులను ముఖ్యమంత్రి సూచించారు. అయితే, డిజైన్ ఇదే ఫైనల్.