ఆ ఒక్కటీ ఓసీలకు లేదు

4 0
Read Time:3 Minute, 38 Second
‘45 ఏళ్ళకే పెన్షన్’ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకేనన్న జగన్
2019లో వస్తా… మద్య నిషేధంతో 2024లో ఓట్లు అడుగుతా

తాను ప్రకటించిన పథకాల్లో ‘45 సంవత్సరాలకే పింఛను’ అగ్రవర్ణాలకు వర్తించదని, అది మినహా మిగిలిన పథకాలన్నీ తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి అందరికీ అందుతాయని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 45 సంవత్సరాలకు పెన్షన్ పథకం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. మిగిలినవారికి పెన్షన్ వయసును 65 ఏళ్ళనుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తామని చెప్పారు. జగన్ 44వ రోజు ‘ప్రజా సంకల్పం యాత్ర’లో భాగంగా మంగళవారం అనంతపురం జిల్లా ధనియాని చెరువు గ్రామంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు.

‘అన్నీ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకే అంటున్నారు. ఓసీలేం చేశారు’ అని ఈ సందర్భంగా ఓ విద్యార్ధిని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు బదులిస్తూ ఆ ఒక్కటే ఓసీలకు వర్తించదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడపై జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. మహిళలను ముఖ్యమంత్రి దారుణంగా మోసగించారని, ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని జగన్  విమర్శించారు. నడిరోడ్డుపై దళిత మహిళ బట్టలూడదీసి కొడితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయవలసిన పని చేయలేదని ఆక్షేపించారు. గతంలో ఎమ్మెల్యే వనజాక్షి, విద్యార్ధిని రిషితేశ్వరి కేసుల్లోనూ ప్రభుత్వం నిందితులను కాపాడిందని దుయ్యబట్టారు.

ఎన్నికల హామీలను చంద్రబాబు నెరవేర్చలేదంటూ.. తన తండ్రి హయాంలో చదువుల విప్లవం వచ్చిందని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఫీజు రీఇంబర్స్ మెంట్ విద్యార్ధుల అవసరాలకు తగినట్టుగా లేదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత… ఫీజులు మొత్తం రీ ఇంబర్స్ చేయడంతోపాటు విద్యార్ధుల ఖర్చులకోసం ఏడాదికి రూ. 20 వేలు ఇస్తామని జగన్ చెప్పారు. చంద్రబాబు డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానన్నారని, అది చేయకపోగా కొత్త రుణాలు ఇవ్వడం మానేశారని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల బ్యాంకు రుణాల మొత్తాన్ని నాలుగు విడతలుగా చేతికే ఇస్తామని, ఆ సొమ్మును మహిళలు ఎందుకైనా ఉపయోగించుకోవచ్చని జగన్ చెప్పారు.

2019లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్న జగన్… ఆ తర్వాత ఐదేళ్లకు వచ్చే (2024) ఎన్నికల నాటికి రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని, అది చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతానని ఉద్ఘాటించారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Leave a Reply