ఎకరం కోటిన్నరే…! హోటళ్ళకు బంపర్ ఆఫర్

1 0
Read Time:3 Minute, 47 Second

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగరంలో స్టార్ హోటళ్ళ నిర్మాణంకోసం ముందుకొచ్చేవారికి ఎకరం కోటిన్నర రూపాయల చొప్పున రేటుకు భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో మూడు కోట్ల రూపాయల రేటు చెప్పడంవల్ల ప్రముఖ హోటళ్ళ యాజమాన్యాలు కూడా వెనుకాడుతున్నాయని అధికారులు నివేదించడంతో ముఖ్యమంత్రి ఓ నిర్ణయం తీసుకున్నారు.

గురువారం ముఖ్యమంత్రి వద్ద రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులపై జరిగిన సమీక్షా సమావేశంలో హోటళ్ళ ఏర్పాటుపై చర్చించారు. రేటు విషయాన్ని అధికారులు ప్రస్తావించగా.. కోటిన్నరకు భూమి కేటాయించాలని సిఎం స్వయంగా చెప్పారు. రాజధాని వాణిజ్య ప్రాంతంలో ఎకరం నాలుగైదు కోట్ల రూపాయలకు విలువ కడుతుండగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం హోటల్ యాజమాన్యాలకు ఓ విధంగా వరం లాంటిది. రాజధాని ప్రాంతంలో విద్యా, వైద్య, పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేసేవారికి రూ. 50 లక్షలకు ఎకరం చొప్పున భూమి కేటాయిస్తున్నారు.

రాజధానిలో హోటళ్ళ నిర్మాణానికి సుమారు 10 ప్రముఖ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే, భూమి ధర తగ్గించాలని వారు కోరుతున్నట్టు అధికారులు తెలిపారు. 2020 నాటికి రాజధానిలోని స్టార్ హోటళ్ళలో 1200 రూములు అందుబాటులోకి వస్తాయని సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ గురువారం ముఖ్యమంత్రి వద్ద సమావేశంలో చెప్పారు. హోటళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ సీఆర్డీయే గత ఏడాది నవంబర్లో ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్లో డజన్ల మంది ఆసక్తి చూపించారు.

ఇదిలా ఉంటే రాజధాని అమరావతి మురికివాడల రహితంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నగరంలో భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలకు తావుండకూడదని ఆయన నిర్దేశించారు. నది, కాలువలతో కూడిన అమరావతి, విజయవాడ ప్రాంతమంతా సుందరంగా తయారు చేయాలన్నారు. ఆయా జలవనరులన్నిటి అనుసంధానం ద్వారా జల రవాణా మార్గాలు అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రాజధానిలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులలో 70 శాతం టెండర్ల దశను పూర్తి చేసుకున్నాయని శ్రీధర్ చెప్పారు. మైస్ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్స్) ప్రాజెక్టును 42 ఎకరాల్లో రూ. 1220 కోట్ల వ్యయంతో చేపట్టామని, ఇది ఆగ్నేయేసియా దేశాల్లోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ అవుతుందని పేర్కొన్నారు.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply