ఐదేళ్ళలో 50% పెరగనున్న బిలియనీర్లు

ఇండియా ఇంకా అల్పాదాయ దేశాల జాబితాలోనే ఉందిగానీ శతకోటి డాలర్లకు పైగా సంపద ఉన్నవారి సంఖ్యకు మాత్రం కొదవ లేదు. రూపాయల్లో చెప్పాలంటే… వేల కోట్లకు అధిపతులైన వారి సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇక సంపద దినదిన ప్రవర్ధమానమై బిలియనీర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో ఏకంగా 50 శాతం పెరుగుతుందట. స్విట్జర్లాండ్ దేశానికి చెందిన బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ స్యూస్ తాజా నివేదికలో ఈమేరకు పేర్కొంది.

2022నాటికి ఇండియన్ల సంపద 6 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందట. అంటే ప్రస్తుత రూపాయి మారక విలువ ప్రకారం 390 లక్షల కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఈ మొత్తం 5 ట్రిలియన్ డాలర్లు. దేశంలో ఇప్పుడు 2,45,000 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారు. ఆ సంఖ్య 2022నాటికి 3,70,000కు పెరుగుతుందని అంచనా.

ఓవైపు మిలియనీర్లు, బిలియనీర్లు ఓవైపు సంపద పెంచుకుంటుంటే మరోవైపు మెజారిటీ ఇండియన్లు చాలా తక్కువ సంపద కలిగి ఉన్నారని క్రెడిట్ స్యూస్ నివేదిక తేటతెల్లం చేసింది. 92 శాతం భారతీయులు నికర విలువ 10 వేల డాలర్ల కంటే తక్కువట. అంటే.. ఆరున్నర లక్షల రూపాయలకంటే తక్కువ. వారిలో కేవలం 0.5శాతం మంది లక్ష డాలర్లకంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నారు.

Related posts

Leave a Comment