ఒకేసారి 175 సీట్లకు అభ్యర్ధుల ప్రకటన

admin

తండ్రిని అనుసరించిన జగన్మోహన్ రెడ్డి

తండ్రి తరహాలో జగన్మోహన్ రెడ్డి జాబితా

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్ధుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్ధులను ప్రకటించిన జగన్, లోక్ సభ అభ్యర్ధులలో నిన్న వెల్లడించగా మిగిలిన 16 మంది పేర్లను కూడా ఆదివారం ప్రకటించారు.

కడప జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించాక పార్టీ అభ్యర్ధుల జాబితాలను జగన్ విడుదల చేశారు. మాట ప్రకారం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామన్న జగన్… 25 లోక్ సభ సీట్లలో ఏడింటిని, 175 అసెంబ్లీ సీట్లలో 41 ఆయా వర్గాలకు కేటాయించామని చెప్పారు. ముస్లింలకు 5 సీట్లు కేటాయించామన్నారు. సర్వేల ఆధారంగా కొద్దిమంది సిటింగ్ లను మార్చినట్టు జగన్ చెప్పారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతల కుటుంబాలకు రెండేసి సీట్లు కేటాయించారు. విజయనగరంలో బొత్స కుటుంబం మొదలుకొని చిత్తూరులో పెద్దిరెడ్డి కుటుంబం వరకు ఈ ఫ్యామిలీ ప్యాకేజీలు అమలయ్యాయి. పెద్దిరెడ్డి కుటుంబానికి రెండు అసెంబ్లీ సీట్లు, ఒక లోక్ సభ సీటు దక్కాయి. ఇటీవల పార్టీలో చేరిన వారందరికీ దాదాపుగా జగన్ సీట్లు ఖరారు చేశారు.

2009 ఎన్నికల సందర్భంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి, 294 సీట్లకు గాను రెండుచోట్ల మినహా అన్నిటికీ ఒకే జాబితాలో (కాంగ్రెస్) అభ్యర్ధులను ప్రకటించారు. ఇప్పుడు జగన్ తండ్రి పద్ధతిని అనుసరించి అన్ని సీట్లకూ ఒకేసారి అభ్యర్ధులను ప్రకటించారు.

శ్రీకాకుళం ఇచ్ఛాపురం పిరియ సాయిరాజ్
  పాలకొండ (ఎస్టీ) విశ్వసరాయి కళావతి
  శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు
  నరసన్నపేట ధర్మాన కృష్ణదాసు
  టెక్కలి పేరాడ తిలక్
  ఆమదాలవలస తమ్మినేని సీతారాం
  పాతపట్నం రెడ్డి శాంతి
  పలాస సీదిరి అప్పలరాజు
  రాజాం (ఎస్.సి) కంబాల జోగులు
  ఎచ్చెర్ల గొర్లె కిరణ్ కుమార్
విజయనగరం పార్వతీపురం (ఎస్.సి) అలజంగి జోగారావు
  సాలూరు (ఎస్టీ) పీడిక రాజన్నదొర
  కురుపాం (ఎస్టీ) పాముల పుష్పశ్రీవాణి
  శ్రుంగవరపు కోట కుదబండ శ్రీనివాస్
  విజయనగరం కోలగట్ల వీరభద్ర స్వామి
  నెల్లిమర్ల బడుకొండ అప్పలనాయుడు
  బొబ్బిలి శంబంగి వెంకటచిన అప్పలనాయుడు
  చీపురుపల్లి బొత్స సత్యనారాయణ
  గజపతినగరం బొత్స అప్పలనాయుడు
విశాఖపట్నం అనకాపల్లి ఎవిఎస్ఎస్ అమరనాథ్ గుడివాడ
  పెందుర్తి అదీప్ రాజ్
  ఎలమంచిలి ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు (కన్నబాబురాజు)
  నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్
  చోడవరం కరణం ధర్మశ్రీ
  మాడుగుల బుడి ముత్యాలనాయుడు
  పాయకారావుపేట (ఎస్.సి) గొల్ల బాబూరావు
  పాడేరు (ఎస్టీ) భాగ్యలక్ష్మి
  అరకు లోయ (ఎస్టీ) చెట్టి పాల్గుణ
  విశాఖపట్నం తూర్పు ఆకారమణి విజయనిర్మల
  విశాఖపట్నం పశ్చిమ విజయ ప్రసాద్ మళ్ల
  విశాఖపట్నం దక్షిణ ద్రోణంరాజు శ్రీనివాస్
  విశాఖపట్నం ఉత్తర కెకె రాజు
  గాజువాక తిప్పల నాగిరెడ్డి
  భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి)
తూర్పు గోదావరి మండపేట పిల్లి సుభాష్ చంద్రబోస్
  రామచంద్రాపురం చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాల క్రిష్ణ
  గన్నవరం (ఎస్.సి) కొండేటి చిట్టిబాబు
  కొత్తపేట చీరాల జగ్గిరెడ్డి
  అమలాపురం (ఎస్.సి) పినిపె విశ్వరూప్
  ముమ్మడివరం పొన్నాడ వెంకటసతీశ్ కుమార్
  రాజోలు (ఎస్.సి) బొంతు రాజేశ్వరరావు
  రంపచోడవరం (ఎస్టీ) నాగులాపల్లి ధనలక్ష్మి
  కాకినాడ నగరం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
  కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు
  పెద్దాపురం తోట వాణి
  ప్రత్తిపాడు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్
  పిఠాపురం పెండెం దొరబాబు
  జగ్గంపేట జ్యోతుల చంటిబాబు
  తుని దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)
  రాజమండ్రి నగరం సూర్యప్రకాశరావు రౌతు
  రాజమండ్రి రూరల్ ఆకుల వీర్రాజు
  రాజానగరం జక్కంపూడి రాజా
  అనపర్తి డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి
పశ్చిమ గోదావరి దెందులూరు కొఠారు అబ్బయ్యచౌదరి
  ఏలూరు ఆళ్ల కాళీ క్రిష్ణ శ్రీనివాస్ (నాని)
  చింతలపూడి (ఎస్.సి) ఎలిజా
  ఉంగుటూరు పుప్పాల శ్రీనివాసరావు
  పోలవరం (ఎస్.టి) తెల్లం బాలరాజు
  ఉండి పివిఎల్ నరసింహరాజు
  తణుకు కారుమూరి వెంకటనాగేశ్వరరావు
  పాలకొల్లు చవటపల్లి సత్యనారాయణ మూర్తి (బాబ్జి)
  భీమవరం గ్రంధి శ్రీనివాస్
  ఆచంట చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
  టి.పి.గూడెం కొట్టు సత్యనారాయణ
  నర్సాపురం ముదునూరి ప్రసాదరాజు
  నిడదవోలు జిఎస్ నాయుడు
  కొవ్వూరు (ఎస్.సి) టి. వనిత
  గోపాలపురం (ఎస్.సి) తలారి వెంకటరావు
కృష్ణ   నూజివీడు మేకా వెంకటప్రతాప అప్పారావు
  కైకలూరు దూలం నాగేశ్వరరావు
  గన్నవరం యార్లగడ్డ వెంకటరావు
  పెనమలూరు కొలుసు పార్థసారధి
  పెడన జోగి రమేష్
  మచిలీపట్నం పేర్ని వెంకట్రామయ్య (నాని)
  అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు
  పామర్రు (ఎస్.సి) కె. అనిల్ కుమార్
  గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)
  విజయవాడ తూర్పు బొప్పన భావ్ కుమార్
  నందిగామ (ఎస్.సి) మొండితోక జగన్మోహన్ రావు
  జగ్గయ్యపేట సామినేని ఉదయభాను
  విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు
  మైలవరం వసంత కృష్ణప్రసాద్
  తిరువూరు (ఎస్.సి) కొక్కిలిగడ్డ రక్షణ నిధి
  విజయవాడ పశ్చిమ వెల్లంపల్లి శ్రీనివాసరావు
గుంటూరు రేపల్లె మోపిదేవి వెంకటరమణరావు
  వేమూరు (ఎస్.సి) మేరుగు నాగార్జున
  బాపట్ల కోన రఘుపతి
  మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి
  పొన్నూరు కిలారి రోశయ్య
  తాడికొండ (ఎస్.సి) ఉండవల్లి శ్రీదేవి
  గుంటూరు పశ్చిమ చంద్రగిరి ఏసురత్నం
  తెనాలి అన్నాబత్తుని శివకుమార్
  ప్రత్తిపాడు (ఎస్.సి) మేకతోటి సుచరిత
  గుంటూరు తూర్పు షేక్ మహ్మద్ ముస్తఫా
  పెదకూరపాడు నంబూరి శంకర్ రావు
  చిలకలూరిపేట విడదల రజని
  సత్తెనపల్లి అంబటి రాంబాబు
  వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు
  నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
  మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
  గురజాల కాసు మహేష్ రెడ్డి
ప్రకాశం చీరాల ఆమంచి కృష్ణమోహన్
  పర్చూరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు
  సంతనూతలపాడు (ఎస్.సి) టిజెఆర్ సుధాకర్ బాబు
  అద్దంకి బాచిన చెంచుగరటయ్య
  కందుకూరు మానుగుంట మహీధర్ రెడ్డి
  కొండపి (ఎస్.సి) డాక్టర్ ఎం. వెంకయ్య
  ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి
  దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్
  మార్కాపురం కెపి నాగార్జునరెడ్డి
  కనిగిరి బుర్రా మధుసూదన యాదవ్
  ఎర్రగొండపాలెం (ఎస్.సి) డాక్టర్ ఆదిమూలపు సురేష్
  గిద్దలూరు అన్నా వెంకట రాంబాబు
నెల్లూరు కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
  నెల్లూరు నగరం పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
  ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
  కోవూరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
  నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  ఆత్మకూరు మేకపాటి గౌతంరెడ్డి
  గూడూరు (ఎస్.సి) వరప్రసాద్
  సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి
  సూళ్లూరుపేట (ఎస్.సి) సంజీవయ్య కిలివేటి
  వెంకటగిరి ఆనం రాంనారాయణ రెడ్డి
చిత్తూరు కుప్పం కె. చంద్రమౌళి
  నగరి ఆర్.కె. రోజా సెల్వమళి
  చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
  చిత్తూరు అరణి శ్రీనివాసులు (జంగాలపల్లి శ్రీనివాసులు)
  పూతలపట్టు (ఎస్.సి) ఎంఎస్ బాబు
  జిడి నెల్లూరు (ఎస్.సి) కె. నారాయణ స్వామి
  పలమనేరు ఎన్. వెంకయ్య గౌడ
  పీలేరు చింతల రామచంద్రారెడ్డి
  మదనపల్లె నవాజ్ బాషా
  తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
  పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి
  శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి
  సత్యవేడు (ఎస్.సి) కె. ఆదిమూలపు
కడప జమ్మలమడుగు ఎం. సుధీర్ రెడ్డి
  ప్రొద్దటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
  మైదుకూరు శెట్టిపల్లి రఘురామిరెడ్డి
  కమలాపురం పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
  బద్వేలు (ఎస్.సి) జి.వెంకట సుబ్బయ్య
  కడప అంజాద్ బాషా షేక్ బేపారి
  పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి
  రాజంపేట మేడా వెంకటమల్లిఖార్జున రెడ్డి
  కోడూరు (ఎస్.సి) కొరముట్ల శ్రీనివాసులు
  రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి
అనంతపురం తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి
  అనంతపురం అర్బన్ అనంత వెంకటరామిరెడ్డి
  కళ్యాణదుర్గం కెవి ఉషశ్రీ చరణ్
  రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి
  సింగనమల (ఎస్.సి) జొన్నలగడ్డ పద్మావతి
  గుంతకల్ యల్లారెడ్డిగారి వెంకట్రామిరెడ్డి
  ఉరవకొండ వై. విశ్వేశ్వర్ రెడ్డి
  హిందూపూర్ కె. ఇక్బాల్ అహ్మద్ ఖాన్ (మాజీ ఐజీ)
  రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
  పెనుకొండ మలగుండ్ల శంకరనారాయణ
  ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
  మడకశిర (ఎస్.సి) ఎం. తిప్పేస్వామి
  కదిరి డాక్టర్ పివి. సిద్దారెడ్డి
  పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
కర్నూలు ఆదోని వై. సాయిప్రసాద్ రెడ్డి
  కర్నూలు హఫీజ్ ఖాన్
  ఎమ్మిగనూరు కె. చెన్నకేశవరెడ్డి
  పత్తికొండ కె. శ్రీదేవి
  ఆలూరు పి. జయరాం (గుమ్మనూరు జయరాం)
  మంత్రాలయం వై. బాలనాగిరెడ్డి
  కొడుమూరు (ఎస్.సి) డాక్టర్ సుధాకర్ బాబు
  నంద్యాల శిల్పా మోహన్ రెడ్డి
  ఆళ్ళగడ్డ గంజుల బిజేంద్రనాథ్ రెడ్డి
  బనగానపల్లె కాటసాని రామిరెడ్డి
  శ్రీశైలం శిల్లా చక్రపాణిరెడ్డి
  పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి
  డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
  నందికొట్కూరు (ఎస్.సి) ఆర్థర్

Share It

Next Post

అంగారకుడి అందం.. హబుల్ తాజా చిత్రం

హబుల్ టెలిస్కోప్ ఈ ఏడాది జూన్ 27వ తేదీన తీసిన జూపిటర్ చిత్రం ఇది. సౌర కుటుంబంలోని అతి పెద్ద గ్రహమైన అంగారకుడిపై ప్రత్యేకమైన ‘గ్రేట్ రెడ్ స్పాట్’ ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. అంగారకుడిపైన అతలాకుతలంగా ఉండే వాతావరణంలో మేఘాల కదలికలు హబుల్ వీడియోలో నిక్షిప్తమయ్యాయి. అంగారకుడి రంగులు, అవి మారే తీరు అధ్యయనం చేస్తున్నవారికి కొత్త క్లూలు అందిస్తున్నాయి. అంగారకుడిపై గ్రేట్ రెడ్ స్పాట్ మన భూమి […]

Subscribe US Now

shares