జ్ఞాపకాలను ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్న నమ్రతా శిరోద్కర్
సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంతో సహా ఎడారి దేశం ఒమన్ వెళ్ళారు. భార్య నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో కలసి సెలవులను ఎంజాయ్ చేశారు. తమ కుటుంబం స్నేహితులతో కలసి గడిపినప్పటి ఫొటోలను మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. మహేష్ బాబు, తాను కుటుంబ స్నేహితులు గ్జేవియర్ అగస్టీన్, ఆయన భార్య సబీనాలతో ఉన్న ఫొటోను నమ్రత తాజాగా పోస్టు చేశారు. అందులో ఆ దంపతులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ సెల్ఫీ ఫొటోను మహేష్ బాబు తీశారు.
ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ బాబు ఒమన్ లో పిల్లలతో సహా ‘ఆట’ పాటలతో ఉల్లాసంగా గడిపారు. మమత తమ ఫొటోలతోపాటు ఒక గేమ్ స్కోరు బోర్డు ఫొటోను కూడా పోస్టు చేశారు. ఆ స్కోరు బోర్డు… గేమ్ లో మహేష్ కుమారుడు గౌతమ్ గెలిచినట్టు చూపిస్తోంది. ఈ పోస్టుకు స్పందించిన మహేష్ అభిమానులు ఒకరు గౌతమ్ ను లిటిల్ సూపర్ స్టార్ అంటే, మరొకరు ‘ఆటలో ఓడిపోవడం ద్వారా సూపర్ స్టార్ మరోసారి మా హృదయాలను గెలుచుకున్నాడు’ అని కామెంట్ పెట్టారు.
నమ్రత తాజాగా శనివారం పోస్టు చేసిన ఫొటోలలో మహేష్ బాబు కనిపించారు. అంతకు ముందు మూడు రోజుల్లో పిల్లలతో తాను, స్నేహితులు ఉన్న ఫొటోలను నమ్రత పోస్టు చేసేసరికి… మహేష్ విహారానికి వెళ్ళలేదని వార్తలు వచ్చాయి. ‘నా పిల్లల గ్యాంగు’, ‘హ్యాపీ హాలిడేస్’ పేరిట కొద్ది రోజుల కిందట పోస్టులు పెట్టిన నమ్రత… శనివారం ‘ఒమన్ జ్ఞాపకాలు’గా పిల్లల ఫొటోతోపాటు మహేష్ బాబు ఉన్న మరో ఫొటోను పంచుకున్నారు.