కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్

0 0
Read Time:1 Minute, 17 Second
జనవరి 2 నుంచి 11 వరకు నిర్వహించనున్న ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లు, శాఖాధిపతులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదో విడత నిర్వహించబోతున్న ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో పది రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలపై ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ప్రజా వినతులను నూరు శాతం పరిష్కరించడమే లక్ష్యమన్న సిఎం…వినతులను ఆర్ధిక, ఆర్ధికేతర అంశాలుగా విభజించి వేగవంతంగా పరిష్కరించే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు.
కుటుంబ వికాసం, సమాజ వికాసం కూడా ముఖ్యమన్న సిఎం… మౌలిక వసతుల కల్పనతో సరిపెట్టకుండా టెక్నాలజీ పరంగా ముందడుగు వేయాలని చెప్పారు. జన్మభూమిలో వ్యాసరచన, చిత్రలేఖనం, క్రీడలు, చర్చా కార్యక్రమాల్లో విజేతలకు బహుమతులు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply