కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న రేవంత్ టీమ్

0 0
Read Time:2 Minute, 33 Second

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, వేం నరేందర్ రెడ్డి, బోడ జనార్ధన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఇతర నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకునే లాంఛనం పూర్తయింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి, ఇతర నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయరమణారావు, బిల్యా నాయక్, రాజాారాం యాదవ్ సహా పలువురు టీడీపీ నాయకులు, టీఆరెస్ నుంచి ధూమాటి సాంబయ్య, ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ నుంచి దరువు ఎల్లన్న, దుర్గం భాస్కర్, బాల లక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తంగా 18 మంది వివిధ స్థాయిలలోని నాయకులు రేవంత్ రెడ్డి టీమ్ లో ఉన్నారు.

టీడీపీ, టీఆరెస్ నేతలు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. చేరికల అనంతరం వారంతా బయటకు వచ్చి మీడియా ముందు హాజరయ్యారు. అయితే, మీడియాతో కేవలం కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అతి క్లుప్తంగా మాట్లాడారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఎఐసిసి కార్యాలయంలో మళ్ళీ మాట్లాడతామని చెప్పి వెళ్ళిపోయారు.

కొత్తగా చేరినవారితో సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా టీఆరెస్ ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా పని చేస్తారని కుంతియా వ్యాఖ్యానించగా… కొత్తగా చేరిన నేతలంతా ఇక కాంగ్రెస్ కుటుంబంలో సభ్యులేనని ఉత్తమ్ చెప్పారు. చేరిన నేతలందరికీ న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఉత్తమ్ వెల్లడించారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply