కుప్పంలో పేదలకు జి+3…ప్రయోగాత్మకం

0 0
Read Time:7 Minute, 3 Second

  • వచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో 5 లక్షల ఎన్టీఆర్ గృహాలు
  • గ్రామీణ గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష
  • ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు, సర్వేకు సీఎం ఆదేశం
  • 13 లక్షల ఎన్టీఆర్ గ్రామీణ గృహాలకు జియోట్యాగింగ్

వచ్చే ఏడాది జూన్ నాటికి ఐదు లక్షల ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణాలను పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వచ్చే జనవరికి 2.5 లక్షలు, వచ్చే జూన్ నాటికి 2.5 లక్షలు కలిపి మొత్తం వచ్చే ఏడాది జూన్ నాటికి 5 లక్షల ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణాలు పూర్తికావాలన్నారు. ఎక్కడెక్కడ ఇళ్లు లేని వారున్నారో గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జనవరి 2019 నిర్దేశిత లక్ష్యల ప్రకారం అన్ని గృహాల నిర్మాణం పూర్తిచేయాలని కోరారు.

 

ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం, పీఎంఎవై తదితర పథకాల ప్రగతిని చంద్రబాబు మంగళవారం సచివాలయంలో సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎంతమందికి ఇళ్లు లేవో సమగ్ర సర్వే చేయాలని, ఇళ్లు లేని వారందరికీ గృహాలు మంజూరుకు చేస్తామని, ఇందుకు ప్రణాళిక యోచిస్తున్నామని స్థలాలు ఇవ్వడం జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం కింద దశలవారీగా నిర్మించే 13 లక్షల గృహాలకు జియో ట్యాంగింగ్ చేయాలని, ఆన్ లైన్ లో ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ లబ్దిదార్లకు ఇచ్చే 500 చ.అడుగులను, 750 చ.అడుగులకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

కుప్పం నియోజకవర్గంలో జి+3 తరహాలో 2000 గృహాలు

కుప్పం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా 2000 గృహాలను జిప్లస్3 (G+3) ప్రాతిపదికన నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో గృహ నిర్మాణానికి రూ.4.5 లక్షల వ్యయం అవుతుందని, ఇందులో రూ.3 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందని, మిగిలిన రూ.1.5 లక్షలను బ్యాంకుల ద్వారా రుణ సహాయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.60 కోట్లు వ్యయమవుతుందని, రూ. 10 కోట్లు సంబంధిత శాఖ భరిస్తుందని తెలిపారు. లబ్దిదారుల గృహాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 60 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 10 కోట్లు వెచ్చించనున్నట్టు చెప్పారు. హౌసింగ్ ప్రాజెక్టుల సమాచారం కోసం, లబ్దిదారుల సంతృప్తి స్థాయి అంచనా వేసేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

‘అనుమతిలేని గృహనిర్మాణాలపై నివేదిక’ 

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్ల సంఖ్య 1,54 000 ఉందని, పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి గృహాలు 8,000 ఉన్నాయంటూ, వీటిపై తనకు సమగ్ర నివేదిక అంతించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్రమబద్ధీకరణ అంశాన్ని పరిశీలిస్తామన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి 5 లక్షల గృహ నిర్మాణాలను పూర్తిచేస్తామన్న లక్ష్యాన్ని స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కాంతిలాల్ దందేను ముఖ్యమంత్రి అభినందించారు.

పీమే (PMAY) లబ్దిదారులకు నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల నుంచి ప్లాన్ అప్రూవల్ నుంచి మినహాయింపునిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. నరేగా నిధులతో సమీకృతం చేసుకున్న గృహ నిర్మాణనాలను వేగవంతంగా పూర్తిచేయాలని కోరారు. కాలనీలకు మంచినీరు, డ్రైనేజీ సదుపాయాలకు ప్రథమ ప్రాథాన్యమివ్వాలని ఆదేశించారు. గృహాల మంజూరు సందర్భంగా, స్వాధీనం చేసే సందర్భంలో, మరే రకమైన అనుమతులకైనా ఒక్క రూపాయి లంచం కూడా ఇవ్వవద్దని లబ్దిదారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటికే ఎవరైనా లంచాలు ఇచ్చి వున్నట్లయితే కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేస్తే వాటిని వెనక్కి ఇప్పిస్తామన్నారు.

ఇప్పటిదాకా ఎన్టీఆర్ హౌసింగ్ (రూరల్, స్పెషల్, అర్బన్, హుద్ హుద్ పునరావాసం, పీఎంఎవై కింద 1,45,000 గృహాల నిర్మాణం పూర్తి చేశామని అధికారులు ప్రెజెంటేషన్ లో వివరించారు. రూ.16,523 కోట్ల విలువ కాగల 8,64,577 ఇళ్లు మంజూరు చేశారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో ఇప్పుడు లబ్దిదారులకు ఇస్తున్న 500 చదరపు అడుగుల స్థలాన్ని 750 చదరపు అడుగులకు పెంచాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. పీఎంఎవై గృహాలకు లబ్దిదారు చొరవతో నిర్మాణం (BLC) కింద నగర పాలికలు, పురపాలక సంఘాల అనుమతులు, ధృవీకరణలనుంచి మినహాయింపునిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

సమావేశంలో గ్రామీణ గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు, గహనిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఏ.వి. రాజమౌళి, రాష్ట్ర గహ నిర్మాణ సంస్థ వైస్ చైర్మన్, ఎండీ కాంతిలాల్ దందే తదితరులు పాల్గొన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply