కొత్తగా కంటెంట్ కార్పొరేషన్

2 0
Read Time:11 Minute, 49 Second
మంత్రిమండలి నిర్ణయాలివి

కంటెంట్ కార్పొరేషన్

  • ఏపీ కంటెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం.
  • APSFLకు సబ్సిడరీగా ఇది పనిచేస్తుంది.
  • విజ్ఞానశాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, పరిపాలన, విద్య, రాజ్యాంగం, ప్రసారం, సాంఘిక సంస్కరణలు, ఆర్థికశాస్త్రం, రాజకీయాలు తదితర అంశాలపై నిరంతర పరిశోధన అవసరమని ప్రభుత్వం భావించింది.
  • కంటెంట్ కార్పొరేషన్ ఈ బాధ్యతలు నిర్వహించనుంది.

డ్రోన్స్ కార్పొరేషన్

  • ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం.
  • ప్రస్తుతం విస్తృతంగా పెరిగిన ప్రభుత్వావసరాలు, ప్రైవేట్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రోన్లకు ప్రత్యేకంగా కార్పొరేషన్ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
  • పోలీస్, మైనింగ్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్, జల వనరులు, అర్బన్ డెవలప్‌మెంట్, సర్వేలు, టూరిజం, ఎస్సెట్ మానిటరింగ్ తదితర సేవలకు వీటిని వినియోగించనున్నారు.
  • టూడీ, త్రిడీ మోడల్స్‌లో హై రిజల్యూషన్ వీడియోలు తీసేందుకు, ఫోటోలు క్యాప్చరింగ్ చేసేందుకు డ్రోన్లను విస్తృతంగా ఉపయోగిస్తారు.
  • ఈ వ్యవహారాలన్నీ డ్రోన్ కార్పోరేషన్ పర్యవేక్షిస్తుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా దీన్ని ఏర్పాటుచేస్తారు.

గుంటూరులో మతాశిశు ఆరోగ్య కేంద్రం (MCHC)

  • గుంటూరు జనరల్ ఆసుపత్రిలో 597 పడకలతో మాతాశిశు ఆరోగ్య కేంద్రం ‘మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్’ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం.
  • రూ.65 కోట్ల వ్యయంతో నెలకొల్పే ‘ఎంసీహెచ్’ను ‘గుంటూరు మెడికల్ కాలేజ్ అలుమ్నీ ఆఫ్ నార్త్ అమెరికా’(GMCANA) ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేస్తారు. ఇందులో GMCANA రూ.30 కోట్లు అందిస్తుంది.
  • జి ప్లస్ 5లో భవనాన్ని నిర్మిస్తారు. ప్రసూతి కోసం 300 పడకలు, చిన్నారుల కోసం 200,PICU కోసం 27, SICU కోసం 30, NICU కోసం 40 పడకలచొప్పున ఏర్పాటుచేస్తారు. 30 ఫ్యాకల్టీ రూములు, 300మందికి సరిపడా కాన్ఫరెన్సు హాలు నిర్మిస్తారు.
  • 2,34,420 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి నిర్మితం కానున్నది.

ఆరోగ్య రంగానికి ప్రపంచబ్యాంక్ రుణం

  • ప్రపంచబ్యాంక్ సహకారంతో రాష్ట్ర ఆరోగ్యరంగాన్ని పటిష్టపరచాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
  • రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను కల్పించేందుకు ప్రపంచబ్యాంక్ నుంచి రుణం తీసుకునేందుకు మంత్రిమండలి అనుమతి ఇచ్చింది.
  • రాష్ట్రంలో వైద్య మౌలిక వసతుల కల్పనకు రూ.4,807 కోట్లు అవసరం అని ప్రతిపాదించగా, ఇందులో ప్రపంచబ్యాంక్ నుంచి 70 శాతం (రూ.3,365 కోట్లు) రుణంగా తీసుకోవాలని, మిగిలిన 30 శాతం (రూ.1,442 కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టాలని నిర్ణయించారు.
  • ఈ నిధులతో రాష్ట్ర వైద్యరంగంలో మౌలిక వసతులను కల్పిస్తారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలను ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లుగా అభివృద్ధి చేయడం,ఆసుపత్రులలో నాణ్యతా ప్రమాణాలు పెంపొందించడం, పేషెంట్ సేఫ్టీ తదితర అంశాలపై దృష్టి పెడతారు.
  • వైద్య సిబ్బందికి అవసరమైన శిక్షణ అందిస్తారు.

అర్బన్ హౌసింగ్

  • పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వం చేపడుతున్న 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఏపీ టీడ్కో నిధులు సమకూర్చునేందుకు బ్యాంకులకు ప్రభుత్వం హామీగా ఉండేందుకు మంత్రిమండలి అంగీకారం.
  • రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో రూ.38,265 కోట్ల వ్యయమయ్యే 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతోంది.
  • ఈ హౌజింగ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,035 కోట్లు, కేంద్రం రూ.7,500 కోట్లు భరిస్తాయి.
  • మిగిలిన మొత్తాన్ని లబ్దిదారుడు సమకూర్చుకుంటాడు.

ఎంపీల ట్రస్టుకు నిధులు

  • రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలలో చేపట్టాల్సిన అభివృద్ధి అవసరాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల రూపకల్పనకు ఏర్పాటు చేసిన ‘మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అలయెన్స్ ఫర్ కలెక్టివ్ ట్రాన్స్‌ఫర్మేషన్’ ట్రస్టుకు రూ.కోటీ 20 లక్షలు విడుదల చేయాలని మంత్రిమండలి నిర్ణయం.
  • బాపట్ల ఎంపీ మాల్యాద్రి శ్రీరామ్ అభ్యర్ధన మేరకు ఈ ట్రస్టుకు నిధులు అందిస్తున్నారు.
  • ఈ పనులకు సంబంధించిన పురోగతిని ఎప్పటికప్పుడు ప్రణాళికా శాఖకు అందించాలని నిబంధన విధించింది.

టాటా ట్రస్టు ద్వారా బాలామృతం

  • ‘బాలామృతం’ వంటి పౌష్టికాహారం తయారు చేసే కర్మాగారం కోసం టాటా ట్రస్టుతో ఒక స్పెషల్ పర్సస్ వెహికిల్ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం.
  • మహిళలకు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని ఈ ట్రస్టు ఎటువంటి లాభాపేక్ష లేకుండా తయారు చేసి అందిస్తుంది.

ఆలయ పోస్టులు

  • టీటీడీ పరిధిలోని అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో 8 పోస్టుల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం.
  • హైకోర్టు ఆదేశానుసారం ఆలయంలో పనిచేస్తున్న 8మంది పోస్టులను రెగ్యులర్ చేయడానికి ఈ పోస్టులకు అనుమతి ఇచ్చింది.
  • ఈ పోస్టుల వల్ల ఏటా రూ.22,53,672 ఖర్చు కానున్నది.

ఆంధ్రప్రదేశ్ పోలీస్ (రిఫామ్స్ అండ్ అమెండ్‌మెంట్) ఆర్డినెన్స్

  • ఆంధ్రప్రదేశ్ పోలీస్ (రిఫామ్స్) (అమెండ్‌మెంట్) ఆర్డినెన్స్, 2017స్థానంలో బిల్లు ప్రవేశపెట్టడానికి మంత్రిమండలి ఆమోదం.
  • రానున్న శాసనసభ సమావేశాలలో ఈ బిల్లు ప్రవేశపెడతారు.

పోలవరం హెడ్ వర్క్స్

  • పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి ప్రత్యేక ముందస్తు నిధులను (స్పెషల్ ఇంప్రెస్ట్ అమౌంట్)పెంచుతూ మంత్రిమండలి ఆమోదం.
  • ఈ అమౌంటును రూ.150 కోట్ల నుంచి రూ.160 కోట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గోరకల్లు ప్రాజెక్టు పనులు

  • గోరకల్లు బైపాస్ కెనాల్ పనులకు చేపట్టిన కాంట్రాక్టరుకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అమౌంటు కింద రూ.4,78,77,638లను చెల్లించడానికి మంత్రిమండలి ఆమోదం.

భూ కేటాయింపులు

  • శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దేవునిపాలవలస గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 13.58 ఎకరాల ప్రభుత్వ భూమిని విశాఖ ఏపిఐఐసి జోనల్ మేనేజర్‌కు ఉచితగా అప్పగించే ప్రతిపాదనకు రాష్ట్రమంత్రిమండలి ఆమోద ముద్రవేసింది.
  • విశాఖ జిల్లాలోని అస్కపల్లి, పూడిమడక, విజయరాంపుర, అగ్రమారం, గుర్రంపాలెం గ్రామాలలో 90.72 ఎకరాల ఎ.డబ్ల్యు.డి, పోరంబోకుగా వర్గీకరించిన భూమిని ఇండస్ట్రియల్ సెజ్ విస్తరణకు, ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ఉచితంగా కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్రమంత్రిమండలి ఆమోదం తెలిపింది.
  • తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామంలో ఎ.డబ్ల్యు.డిగా వర్గీకరించిన 3.43 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ యూనిట్ల ఏర్పాట్లకు గాను ఏపీఐఐసికి అప్పగించే ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది.
  • చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నాగమంగళం గ్రామంలో 7.44 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండస్ట్రియల్ పార్కు నెలకొల్పేందుకు ఉచితంగా కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్రమంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
  • చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం, మొలకలదిన్నె గ్రామంలో 24.13 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్కు నెలకొల్పేందుకు ఏపీఐఐసీకి అప్పగించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
  • చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం కోటవూరు గ్రామంలో3.74 ఎకరాల ప్రభుత్వ భూమిని హార్సిలీ హిల్స్‌లో హై ఆల్టిట్యూడ్ క్రీడా శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం విజయవాడలోని స్పోర్టస్ అథారిటీ  వైస్ చైర్మన్ అండ్ ఎండీకి ఉచితంగా  అప్పగించే ప్రతిపాదనకు రాష్ట్రమంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
  • అనంతపురము జిల్లా కుదేరు మండలం కుదేరు గ్రామంలో ఏపీఐఐసికి ఇప్పటికే అప్పగించిన 421.37 ఎకరాల భూమిలో 16.50 సెంట్ల భూమిని వెనక్కి తీసుకుని ఎన్.ఆర్.ఇ.డి.క్యాప్ (NREDCAP) వైస్ చైర్మన్&ఎండీకి ముందస్తుగా స్వాధీనం చేసే అధికారాన్ని జిల్లాకలెక్టర్‌కు దఖలు పరిచేప్రతిపాదనకు రాష్ట్రమంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
  • కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలో 25 ఎకరాల ప్రభుత్వ భూమిని సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నాచురోపతీ (CRIYN) స్థాపనకు విజయవాడలో ఉన్న ఆయుష్ ఎక్స్ అఫీషియో కార్యదర్శికి అప్పగించే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply