కొరియా నుంచి తిరిగొచ్చిన సిఎం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు రోజుల దక్షిణ కొరియా పర్యటనను ముగించుకొని తిరిగి వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో దిగిన ఆయనకు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, యువ నాయకుడు దేవినేని అవినాశ్, వారితోపాటు కొంత మంది కార్యకర్తలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. కొరియా పర్యటనను విజయవంతం చేసుకొని తిరిగి వచ్చారని ముఖ్యమంత్రిని అభినందించారు.

ఈ నెల 4,5,6 తేదీల్లో ముఖ్యమంత్రి దక్షిణ కొరియాలో పర్యటించారు. పెట్టుబడులకోసం పలు పారిశ్రామిక సదస్సుల్లో పాల్గొన్న సిఎం, ఇప్పటికే అనంతపురంలో ప్లాంటు ఏర్పాటు చేస్తున్న కియా మోటార్స్ ప్రతినిధులనూ కలుసుకున్నారు. కియా మోటార్స్ యాన్సిలరీ యూనిట్ల ఏర్పాటుకోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎల్.జి. సహా పలు సంస్థలు ఆంధ్రప్రదేశ్ రావడానికి ఆసక్తిని ప్రదర్శించిన నేపథ్యంలో… ముఖ్యమంత్రి పర్యటన విజయవంతమైనట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

స్వాగతం పలికి సెల్ఫీలు తీసుకుంటున్న యువ కార్యకర్తలు

Leave a Comment