చంద్రబాబు కొరియా పర్యటన పూర్తి వివరాలు

2 0
Read Time:11 Minute, 47 Second

ఆటోమొబైల్ దిగ్గజం ‘కియా’ మోటార్స్ ఇచ్చిన కిక్కుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దక్షిణ కొరియా పర్యటనకు ఉపక్రమించారు. ఈ నెల 4,5,6 తేదీల్లో ముఖ్యమంత్రి ఒక అధికార బృందంతో ఆయన కొరియాలో పర్యటించనున్నారు. సిఎం కొరియా పర్యటన వివరాలను ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ శుక్రవారం సచివాలయంలో వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాలు యధాతథంగా…

• పెట్టుబడుల ఆకర్షణే ప్రధానాంశంగా ముఖ్యమంత్రి సియోల్, బూసన్ నగరాలలో పర్యటిస్తారు.
• కియా మోటార్స్ హెడ్‌క్వార్టర్స్ సందర్శించి, బిజినెస్ సెమినార్‌లో పాల్గొంటారు.
• కృష్ణపట్నం పోర్టుతో భాగస్వామ్యానికి సంబంధించిన మరో బిజినెస్ సెమినార్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
• ముఖ్యంగా, బూసన్ సిటీలోని పూసన్ న్యూపోర్టు కంపెనీ, మేకిన్ ఇండియా సెంటర్, నాక్-శాన్ నేషనల్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, మయోంగ్జీ ఫ్రీ ఎకనమిక్ జోన్ సందర్శిస్తారు.
• కొరియా కార్ల దిగ్గజం ‘కియా’, దాని అనుబంధ సంస్థలు మొత్తం కలిపి రూ.13,500 కోట్ల పెట్టుబడులతో అనంతపురము జిల్లాలో ఆల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ప్రాజెక్టును నెలకొల్పుతోంది. ఈ స్ఫూర్తితో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి ఈ యాత్ర తలపెట్టారు.
• డిసెంబర్ 4న ఎస్సెట్జ్ గ్రూపుతో ఏపీఈడీబీ అనంతపురములో ఏర్పాటుచేయనున్న వరల్డ్ క్లాస్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుకు సంబంధించి ఎంవోయూ కుదుర్చుకోబోతున్నాయి. ఇండస్ట్రియల్ పార్క్, లాజిస్టిక్ పార్క్, వేర్ హౌసింగ్, కమర్షియల్ స్పేస్, హౌసింగ్, గోల్ఫ్ కోర్స్ ఇందులో భాగంగా ఉంటాయి. ఇందులో 29 కంపెనీలు భాగస్వామ్యం అవుతాయి. మరో 10 కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.
• కియా మోటార్స్‌కు సంబంధించి 17 అనుబంధ సంస్థలతో ఏపీఐఐసీ, ఈడీబీ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. ఈ సంస్థల ప్రతినిధులు డిసెంబర్ 4న ముఖ్యమంత్రితో భేటీ అవుతారు.
• డిసెంబర్ 5న బూసన్, ఏపీఐఐసీ మధ్య ఎంవోయూ జరిగే అవకాశం ఉంది.
• డిసెంబర్ 5, 6 తేదీలలో 2 రోడ్ షోలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
• డిసెంబర్ 5న బూసన్ సిటీలో కొరియా భారత రాయబారి కార్యాలయం, ఏపీ ప్రభుత్వంతో కలిసి బిజినెస్ సెమినార్ నిర్వహిస్తారు.
• డిసెంబర్ 6న కియా మోటార్స్‌తో కలిసి మరో బిజినెస్ సెమినార్‌ జరుగుతుంది.
• ఈ పర్యటనలోనే కియా మోటార్స్ హెడ్ క్వార్టర్స్ సందర్శించి వైస్ చైర్మన్ HYOUNG KEUN LEE తో భేటీ అవుతారు.
• ముఖ్యమంత్రి బృందంలో ఆర్థికమంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు, వాణిజ్యం, పరిశ్రమలు, ఆహారశుద్ధి శాఖల మంత్రి శ్రీ అమరనాథరెడ్డి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోకియా రాజ్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్, ఏపీఐఐసీ ఎండీ అహ్మద్ బాబు ఉన్నారు.

ఆరు ద్వైపాక్షిక సమావేశాలు

ఆటోమైబైల్ దిగ్గజం ‘కియా’ వైస్ చైర్మన్
లొట్టె కార్పొరేషన్ ప్రెసిడెంట్
(90కు పైగా వివిధ బిజినెస్ యూనిట్స్, క్యాండీ తయారీ, బేవరేజెస్, హోటల్, ఫాస్టుఫుడ్, రిటైల్, ఫైనాన్సియల్ సర్విసెస్, హెవీ కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, కనస్ట్రక్షన్, పబ్లిషింగ్, ఎంటర్‌టైన్‌మెంట్)
కొకం కంపెనీ లిమిటెడ్ సీఈవో
(ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్, లిథియమ్ పాలిమర్స్ బ్యాటరీస్)
ఓసీఐ కంపెనీ లిమిటెడ్ ప్రెసిడెంట్
(గ్రీన్ ఎనర్జీ కంపెనీ, పెట్రో అండ్ కోల్ కెమికల్స్, ఇనార్గానిక్ కెమికల్స్, రెన్యువబుల్ ఎనర్జీ ప్రోడక్ట్స్)
యంగ్ వన్ కంపెనీ చైర్మన్
(లీడింగ్ గ్లోబల్ మాన్యుఫాక్చరర్-అవుడ్డోర్ అథ్లెటిక్ క్లాతింగ్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్)
కొరియా ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ మేనేజింగ్ డైరెక్టర్

గ్రూపు మీటింగ్స్ 
17 కియా అనుబంధ సంస్థల ప్రతినిధులు (ఆటోమొబైల్)
కియాకు అనుబంధంగా ఉన్న మరో 27 టూ టైర్, త్రీ టైర్ సంస్థల ప్రతినిధులు (ఆటోమొబైల్)

దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు

బూసన్ కాన్సులేట్ జనరల్ జియాంగ్ టెక్ మిన్
బూసన్ మెట్రో పాలిటన్ సిటీ మేయర్ సుహ్ బైంగ్సూ

ఎంవోయూలు 

2 ఎంవోయూలు ఇప్పటికి ఖరారు, మరొకటి జరిగే అవకాశం
1. ఎస్సెట్జ్ గ్రూపుతో ఏపీఈడీబీ ఎంవోయూ (ఇది ప్రాపర్టీ కంపెనీ)
(అనంతపురములో ఏర్పాటుచేయనున్న వరల్డ్ క్లాస్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుపై)
2. కియా మోటార్స్‌ 17 అనుబంధ సంస్థలతో ఏపీఐఐసీ, ఈడీబీ అవగాహన ఒప్పందం.
3.బూసన్, ఏపీఐఐసీ మధ్య ఎంవోయూ జరిగే అవకాశం.

రోడ్ షోలు-బిజినెస్ సెమినార్లు  
5న ఎంబసీతో కలిసి ఏపీ ప్రభుత్వం బిజినెస్ సెమినార్
6న కియా మోటార్స్‌తో కలిసి సియోల్‌లో బిజినెస్ సెమినార్

ఏపీకి, దక్షిణకొరియాకి సామీప్యతలు
• దక్షిణకొరియాతో ఏపీకి అనేక అంశాలలో సారూప్యత ఉంది.
• జనాభాపరంగా దక్షిణకొరియా, ఆంధ్రప్రదేశ్ రెండూ సమానంగానే ఉన్నాయి. విస్తీర్ణంలో దగ్గరదగ్గరగా ఉంటాయి.
• దక్షిణకొరియాలో ఉన్నట్టే ఏపీలో కూడా సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది.
• దక్షిణకొరియా ఎలాగైతే వేరుపడిందో ఇక్కడ కూడా అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వేరుచేయబడింది.
• ఎలాగైతే దక్షిణకొరియా స్వల్పకాలంలోనే సొంతకాళ్లపై నిలబడగలిగిందో, అలానే ఇక్కడ కూడా రెండేళ్ల కాలంలోనే రెండంకెల వృద్ధి రేటుతో నవ్యాంధ్రప్రదేశ్ నిలబడింది.
• అక్కడ ఆ దేశం ఎలాగైతే పారిశ్రామికంగా అభివృద్ధి సాధించి స్ఫూర్తిదాయకంగా నిలిచిందో, పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో ఉన్నది.
• ఏపీని రెండో రాజధానిగా మార్చుకోవాలని పలు కొరియన్ కంపెనీలు ఇటీవల అమరావతి విజిట్ చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి సూచించారు.

ఏపీలో బూసన్ తరహా ఇండస్ట్రియల్ సిటీ 
• ఆంధ్రప్రదేశ్‌లో అన్ని అనుకూలతలు ఉన్న ఏదైనా ఒక ప్రాంతంలో కొరియన్ సిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. సమగ్ర ప్రతిపాదనలతో వస్తే అవగాహన ఒప్పందాలు కూడా చేసుకుందామని ముఖ్యమంత్రి చెప్పారు.
• నిర్దిష్ట ప్రతిపాదనలతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన వారందరికీ సత్వర అనుమతులిచ్చి తగిన సహకారం అందిస్తామని హామీఇచ్చారు.
• పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే అనుమతులు సులభంగా అందించడమే కాకుండా, భూములు, నీరు, నిరంతర విద్యుత్, ఇతర రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
• బూసన్‌లో ఉన్న మొత్తం 3వేల కంపెనీలు వచ్చినా అందరికీ ఇక్కడ అపార అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పారు.

కియా రాకతో మరిన్ని కంపెనీలు క్యూ  
• పెద్దసంఖ్యలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకువస్తే ప్రభుత్వపరంగా అన్నివిధాలా ప్రోత్సాహం కల్పించేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
• ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనేక సానుకూలతలను చూసి ఇప్పటికే పలు కొరియన్ కంపెనీలు ముందుకొచ్చాయి.
• దక్షిణకొరియాకు చెందిన చిన్నకార్ల జెయింట్ ‘కియా’ అనంతపురంలో ప్లాంటు ఏర్పాటుచేస్తోంది. దానికి అనుబంధంగా మరో 39 అనుబంధ సంస్థలు ముందుకు వచ్చాయి.
• అదే బాటలోనే దక్షిణకొరియా నుంచి మరికొన్ని సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి.
• ఈమధ్యనే దక్షిణకొరియా కాన్సుల్ జనరల్ జియోంగ్ డ్యూయెక్ మిన్ నేతృత్వంలో ఏపీలో పారిశ్రామికవేత్తల బృందం ఒకటి ఏపీలో పర్యటించింది. ఏయే రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయో సమగ్రంగా అధ్యయనం చేసింది. ఈ రాష్ట్రంలో భూముల లభ్యత, రాయితీలు, సహకారం, అనుమతులిచ్చే విధానం తదితర అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని ఈ బృందం సంతృప్తి చెంది వెళ్లింది.
• ఎలక్ట్రిక్ స్టీల్, లాజిస్టిక్, నిర్మాణరంగం, ఫైనాన్స్, ఆటోమొబైల్ కాంపొనెంట్స్, హెవీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, బ్యాటరీ, మీట్ ప్రాసెసింగ్, లిక్కర్స్, షిప్ బిల్డింగ్, మెడికల్, మెరైన్ అక్విప్‌మెంట్ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు సిద్దంగా ఉన్నాయి.
• ఏపీలో ఓడరేవుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి అంశాలలో మనం కొరియా సహకారాన్ని కోరుతున్నాం.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply