జన్మభూమికోసం జిల్లాకు కోటి

జన్మభూమి కార్యక్రమాల నిర్వహణకోసం జిల్లాకు కోటి రూపాయల చొప్పున కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. అర్హులందరికీ ‘జన్మభూమి-మాఊరు’లో పింఛన్లు అందిస్తామని సిఎం చెప్పారు. ప్రజాసాధికార సర్వేలో పేరు నమోదు చేసుకున్నవారు, ఆధార్ కార్డు వున్నవారు ప్రభుత్వ పథకాలకు అర్హులని స్పష్టం చేశారు.

గ్రామాలకు స్టార్ రేటింగ్‌లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామాలకు 10 స్టార్ల రేటింగ్ ఇస్తామన్నారు. వివిధ అంశాల్లో సాధించిన ఫలితాలనుబట్టి గ్రామాలకు రేటింగ్ ఉంటుందని సిఎం చెప్పారు. అన్నింటికన్నా ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

Related posts

Leave a Comment