అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న జైసింహ చిత్రం ఫస్ట్ లుక్ బుధవారం విడుదలైంది. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్న ఈ మూవీలో బాలకృష్ణ సరసన నయనతార నటిస్తున్నారు. గతంలో ఘన విజయం సాధించిన సింహ, తర్వాత వచ్చిన శ్రీరామరాజ్యం సినిమాలలో బాలకృష్ణ సరసన నయనతార ప్రేక్షకులను మెప్పించారు.
హిట్ సినిమాల తర్వాత పైసావసూల్ వంటి డిజాస్టర్ ను చవిచూసిన బాలకృష్ణ, జైసింహపై నమ్మకం పెట్టుకున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో బాలకృష్ణ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. మరోవైపు రాజకీయ నేతల ధర్నా దృశ్యమూ కనిపిస్తోంది. దీన్నిబట్టి సంక్రాంతికి మంచి పొలిటికల్ మసాలా మూవీ వస్తోందని భావించవచ్చు.
సి. కళ్యాణ్ నిర్మిస్తున్న జైసింహకు ప్రముఖ తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగానే నయనతార ట్వీట్ చేశారు.