జోకాంగ్ బౌద్ధ దేవాలయంలో అగ్నిప్రమాదం

0 0
Read Time:1 Minute, 3 Second

చైనాలోని టిబెట్ రాజధాని లాసాలో ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రం జోకాంగ్ దేవాలయం శనివారం అగ్నిప్రమాదానికి గురైంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఉన్న ఈ క్షేత్రాన్ని బౌద్ధులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 652లో స్థాపించారు. అనేకసార్లు విస్తరించారు.

స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6:00 గంటలకు అగ్ని ప్రమాదం జరిగి దేవాలయం మంటల్లో చిక్కుకుంది. అయితే, దేవాలయ ప్రధాన భవనం దగ్ధమైనదీ లేనిదీ స్పష్టమైన సమాచారం రాలేదు. ప్రమాదానికి కారణాలు కూడా తెలియాల్సిఉంది. ప్రాణనష్టం జరిగినట్టు ఇంతవరకు ఎలాంటి సమాచారమూ లేదు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply