టాప్ టెన్ మనీ లాండరర్లలో జగన్… ఈడీ జాబితా ఇదీ

admin

దేశంలోని టాప్-10 మనీ లాండరర్ల జాబితాలో ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ పేరు చేరింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇప్పటివరకు నిర్ధారించిన మేరకు రూపొందించిన జాబితాలో జగన్ పేరు పదో స్థానంలో ఉంది. డొల్ల కంపెనీల ద్వారా సొమ్మును విదేశాలకు తరలించి… మరో రూపంలో దాన్ని తిరిగి ఇండియాకు చేర్చే ఘరానా మోసంలో గుజరాతీయులు అగ్ర స్థానంలో నిలిచారు.

జగన్మోహన్ రెడ్డి 31 కంపెనీల ద్వారా రూ. 368 కోట్లమేరకు అక్రమ లావాదేవీలకు పాల్పడినట్టు ఈడీ జాబితా చెబుతోంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న సూరత్ వాలాలు అఫ్రోజ్ మహ్మద్ హసన్, మదన్ లాల్ జైన్ ఏకంగా 5,396 కోట్ల మేరకు లాండరింగ్ కు పాల్పడ్డారట. ఢిల్లీకి చెందిన ఎన్ కె ఎస్ హోల్డింగ్స్ రూ. 3,700 కోట్ల లాండరింగ్ తో రెండో స్థానంలో నిలిచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో రూ. 3,600 కోట్లు అక్రమంగా మార్పిడి జరిగితే.. ముంబైకి చెందిన రాజేశ్వర్ ఎక్స్ పోర్ట్స్ 1,500 కోట్లు అక్రమంగా తరలించింది.

ఈడీ జాబితాలో జగన్ తో పాటు మరికొందరు రాజకీయ నాయకులు, అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. అందులో మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజ్ బల్… 81 కంపెనీల ద్వారా 200 కోట్లు అక్రమంగా తరలించినట్టు ఈడీ తేల్చింది. ఈడీ జాబితాలో భుజ్ బల్ స్థానం 12. ఈ టాప్ లాండరర్ల కేసుల్లో ఈడీ ఇప్పటివరకురూ. 3,587 కోట్ల మేరకు ఆస్తులను జప్తు చేసింది. 19 మందిని అరెస్టు చేసింది.

ఈడీ జాబితాలోని పేర్లు, వారు అక్రమంగా తరలించిన సొమ్ము వివరాలు..

అఫ్రోజన్ మహ్మద్ హసన్ ఫట్టా, మదన్ లాల్ జైన్ – 5,396 కోట్లు

ఎన్ కె ఎస్ హోల్డింగ్స్   3,700

బ్యాంక్ ఆఫ్ బరోడా కేసు  3,600

రాజేశ్వర్ ఎక్స్ పోర్ట్స్   1,500

సిండికేట్ బ్యాంకు కేసు  1,056

సిద్ధివినాయక లాజిస్టిక్స్  836

మనీష్ జైన్  586

పేస్ ఇంటర్నేషనల్ 418

యోగేశ్వర్ డైమండ్స్ 384

వైెఎస్ జగన్మోహన్ రెడ్డి 368

తాయల్ గ్రూప్   296

ఛగన్ భుజ్ బల్  200 కోట్లు.

Leave a Reply

Next Post

‘నానో’ ఎలక్ట్రిక్ అవతారం ‘నియో’.. ఇక ‘టాటా’ ముద్ర ఉండదు

ShareTweetLinkedInPinterestEmailShareTweetLinkedInPinterestEmail

Subscribe US Now

shares