ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో సైన్స్ సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోసం ఇప్పటికే 70.11 ఎకరాల భూమిని తిరుపతిలో గుర్తించారు. బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో తిరుపతి సైన్స్ సిటీకి ఆమోద ముద్రపడింది.
తిరుపతి సైన్స్ సిటీపై సంక్షిప్తంగా…
• సైన్స్ సిటీ మ్యూజియం, పరిశోధనశాల, అవుట్ డోర్ సైన్స్ పార్క్, కన్వెన్షన్ సెంటర్ ఇందులో ఉంటాయి.
• ఈ సైన్స్ సిటీ భారతదేశానికి ఒక రోల్ మోడల్‌గా ఉండబోతోందని అధికారులంటున్నారు.
• భారతదేశంలో భవిష్యత్తులో జరగబోయే శాస్త్ర ప్రయోగాలు, సాంకేతిక ఆవిష్కరణలకు ఈ సైన్స్ సిటీని హబ్‌గా మార్చాలన్నది ప్రభుత్వ ప్రయత్నం.
• కేంద్ర శాస్త్ర పరిశోధన మంత్రిత్వశాఖ నుంచి ఈ సైన్స్ సిటీ ఏర్పాటుకు తగిన ప్రోత్సాహం లభిస్తుందని రాష్ట్ర మంత్రిమండలి అభిప్రాయపడింది.
• తిరుపతి, విశాఖ, అమరావతి నగరాలలో సైన్స్ సిటీలను ఏర్పాటు చేయాలని ముందుగా అనుకున్నా, తొలుత తిరుపతిలో దీనిని ఏర్పాటుచేస్తున్నారు.