నాగాలాండ్, మేఘాలయలలో ఫిబ్రవరి 27న
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదల
ఫలితాలు ప్రకటించేది మార్చి 3న
ఈశాన్య ప్రాంతంలోని మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూళ్ళను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. రాజకీయంగా కీలకమైన త్రిపుర రాష్ట్ర అసెంబ్లీకి విడిగా ఫిబ్రవరి 18వ తేదీన పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల కమిషన్… నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలకు మాత్రం ఒకేసారి ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది. మూడు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ మాత్రం ఒకేసారి మార్చి మూడో తేదీన జరుగుతుంది.
అసెంబ్లీల కాల పరిమితి మేఘాలయకు మార్చి 6న, నాగాలాండ్ కు మార్చి 13న, త్రిపురకు మార్చి 14న పూర్తి కానుంది. మూడు అసెంబ్లీలలోనూ 60 చొప్పున సీట్లు ఉన్నాయి. త్రిపురకు విడిగా ముందుగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గజెట్ నోటిఫికేషన్ ఈ నెల 24వ తేదీన, మిగిలిన రెండు రాష్ట్రాల నోటిఫికేషన్ 31వ తేదీన వెలువడుతాయి. రెండు షెడ్యూళ్ళు ఈ విధంగా ఉన్నాయి.
త్రిపుర షెడ్యూలు ఇదీ…
గజెట్ నోటిఫికేషన్… జనవరి 24న
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ… జనవరి 31
నామినేషన్ల పరిశీలన… ఫిబ్రవరి 1న
నామినేషన్ల ఉపసంహరణ గడువు… ఫిబ్రవరి 3
పోలింగ్ తేదీ… ఫిబ్రవరి 18
ఓట్ల లెక్కింపు… మార్చి 3
ఎన్నికల ప్రక్రియకు ముగింపు… మార్చి 5
మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు
గజెట్ నోటిఫికేషన్… జనవరి 31
నామినేషన్ల దాఖలుకు గడువు… ఫిబ్రవరి 7
నామినేషన్ల పరిశీలన… ఫిబ్రవరి 8
నామినేషన్ల ఉపసంహరణ గడువు… ఫిబ్రవరి 12
పోలింగ్ తేదీ… ఫిబ్రవరి 27
ఓట్ల లెక్కింపు… మార్చి 3
ఎన్నికల ప్రక్రియ ముగిసే తేదీ… మార్చి 5