నందినెత్తిన ‘బాహుబలి’, ఆధిపత్యం చాటిన ‘లెజెండ్’

3 0
Read Time:10 Minute, 30 Second
2014, 2015, 2016 వెండి తెర నంది అవార్డుల ప్రకటన
ఉత్తమ నటులుగా బాలకృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్
ఉత్తమ దర్శకులు బోయపాటి, రాజమౌళి, సతీష్ వేగేశ్న
ఉత్తమ నటీమణులు అంజలి, అనుష్క, రీతూవర్మ
2016 ఉత్తమ చిత్రం పెళ్ళిచూపులు…జనవరిలో ప్రదానోత్సవం…

మూడేళ్ల నంది అవార్డులకు ఒకేసారి విజేతలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో ఒకేసారి ప్రకటించారు. నంది అవార్డుల ఎంపిక కమిటీ 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను నంది విజేతలను మంగళవారం విజయవాడలో వెల్లడించింది. అనుకున్నట్టుగానే 2015 సంవత్సరానికి ’బాహుబలి’ సత్తా చాటింది. డజనుకు పైగా విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. 2014కు ‘లెజెండ్’ ఊహించినదానికంటే ఎక్కువ అవార్డులను సొంతం చేసుకుంది. ఆ రెండు సంవత్సరాలతో పోలిస్తే 2016 అవార్డుల ఎంపిక వైవిధ్య భరితంగా ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చి అమితంగా ఆకర్షించిన పెళ్ళి చూపులు ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

నటీనటుల విషయానికొస్తే… 2014లో లెజెండ్ సినిమాకుగాను బాలకృష్ణ, 2015లో శ్రీమంతుడు సినిమాకు గాను మహేష్ బాబు, 2016లో నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలకు గాను జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుల అవార్డులను కైవశం చేసుకున్నారు. నటీమణుల్లో అంజలి (గీతాంజలి 2014), అనుష్క (సైజ్ జీరో 2015), రీతూవర్మ (పెళ్ళిచూపులు 2016) నంది విజేతలుగా నిలిచారు. ఉత్తమ దర్శకులుగా వరుసగా బోయపాటి శ్రీను (లెజెండ్), ఎస్ఎస్ రాజమౌళి (బాహుబలి), సతీష్ వేగేశ్న (శతమానం భవతి) ఎంపికయ్యారు. 2014కు గాను లెజెండ్ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ విలన్ వంటి ప్రధాన కేటగిరిలన్నిటిలో బంగారు నందులు సొంతం చేసుకోవడం విశేషం. నిజానికి బాహుబలి సినిమాకు కూడా ఇన్ని ప్రధాన అవార్డులు రాలేదు. ఆ ఏడాదికి ఉత్తమ నటుడు అవార్డు మహేష్ బాబుకు దక్కింది. అయితే, సాంకేతిక నిపుణుల్లో మాత్రం ప్రధాన అవార్డులను బాహుబలి సొంతం చేసుకుంది.

ఇక నంది అవార్డులతోపాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి పేర్లతో ఇచ్చే అవార్డులనూ ప్రకటించారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డును 2014కు గాను మహానటుడు కమల్ హాసన్ కు, 2016కుగాను దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రకటించారు. మధ్యలో 2015కు తెలుగు దర్శక ధిగ్గజం రాఘవేంద్రరావును ఎంపిక చేశారు. రఘుపతి వెంకయ్య అవార్డుకు 2016కుగాను తెలుగు తెర మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేశారు. ఈ అన్ని అవార్డులనూ వచ్చే జనవరిలో జరిగే ప్రదానోత్సవంలో విజేతలకు అందిస్తారు.

నంది అవార్డుల ఎంపిక కోసం మూడేళ్ళ జ్యూరీలకు గిరిబాబు, జీవిత, పోకూరి బాబూరావు నేతృత్వం వహించారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డు, ఇతర పెద్దల పేరిట ఉన్న అవార్డుల ఎంపికను నిర్మాత సురేష్ బాబు నేతృత్వంలోని కమిటీ చేపట్టింది. ఈ కమిటీలు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసి జాబితాలను అందజేశారు. ఆ తర్వాత బహిరంగంగా ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత నంది అవార్డుల ప్రదానోత్సవ వేడుకు ఇంతవరకు జరగలేదు. 2012, 2013 సంవత్సరాలకు కూడా అవార్డులను ఈ ఏడాది మార్చిలోనే ప్రకటించారు. ఈ ఐదేళ్ళకు సంబంధించిన అవార్డలు ప్రదానోత్సవం ఒకేసారి జరుగుతుందని సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు.

 

మూడు సంవత్సరాల్లో ముఖ్యమైన అవార్డుల విజేతలు వీరే…

2014 నంది అవార్డుల హైలైట్స్

ఉత్తమ చిత్రం… లెజెండ్

ఉత్తమ దర్శకుడు… బోయపాటి శ్రీను (లెజెండ్)

ఉత్తమ నటుడు… బాలకృష్ణ (లెజెండ్)

ఉత్తమ నటి… అంజలి (గీతాంజలి)

ఉత్తమ విలన్.. జగపతిబాబు (లెజెండ్)

ఉత్తమ సంగీత దర్శకుడు… అనూప్ రూబెన్స్ (మనం)

ఉత్తమ గాయకుడు… విజయ్ ఏసుదాస్ (లెజెండ్)

ఉత్తమ గాయని… కెఎస్ చిత్ర (ముకుంద)

ఉత్తమ కథా రచయిత…కృష్ణవంశీ (గోవిందుడు అందరివాడేలే)

ఉత్తమ స్క్రీన్ ప్లే… ఎఎస్ రవికుమార్ చౌదరి (పిల్లా నువ్వులేని జీవితం)

ఉత్తమ సహాయ నటుడు… నాగచైతన్య (మనం)

ఉత్తమ సహాయ నటి… మంచు లక్ష్మి (చందమామ కథలు)

ఉత్తమ హాస్య నటుడు.. బ్రహ్మానందం (రేసు గుర్రం)

ఉత్తమ హాస్య నటి… విద్యుల్లేఖ రామన్ (రన్ రాాాాజా రన్)

ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్ట్ (ఎస్వీ రంగారావు) అవార్డు… రాజేంద్రప్రసాద్ (టామీ)

ఉత్తమ బాల నటుడు… గౌతమ్ (1 నేనొక్కడినే)

ఉత్తమ బాల నటి… అనూహ్య (ఆత్రేయ)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్… సాయి శ్రీరామ్ (అలా ఎలా)

ఉత్తమ కళా దర్శకుడు… విజయకృష్ణ

ఉత్తమ కొరియోగ్రాఫర్… ప్రేమ్ రక్షిత్ (ఆగడు)

ఉత్తమ ఫైట్ మాస్టర్… రామ్ లక్ష్మణ్ (లెజెండ్)

ద్వితీయ ఉత్తమ చిత్రం.. మనం

తృతీయ ఉత్తమ చిత్రం… హితుడు

ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు… చందు మొండేటి (కార్తికేయ)

స్పెషల్ జ్యూరీ అవార్డు…సుద్దాల అశోక్ తేజ

2015 అవార్డుల హైలైట్స్

ఉత్తమ చిత్రం… బాహుబలి

ఉత్తమ దర్శకుడు… రాజమౌళి (బాహుబలి)

ఉత్తమ నటుడు… మహేష్ బాబు (శ్రీమంతుడు)

ఉత్తమ నటి… అనుష్క (సైజ్ జీరో)

ఉత్తమ విలన్… రానా (బాహుబలి)

ఉత్తమ సంగీత దర్శకుడు… కీరవాణి (బాహుబలి)

ఉత్తమ గాయకుడు… కీరవాణి (బాహుబలి.. జటా జటా)

ఉత్తమ గాయని… చిన్మయి

ఉత్తమ కథా రచయిత… క్రిష్ (కంచె)

ఉత్తమ స్క్రీన్ ప్లే… కిశోర్ తిరుమల (నేను శైలజ)

ఉత్తమ సహాయ నటుడు… పోసాని కృష్ణ మురళి

ఉత్తమ సహాయ నటి… రమ్యకృష్ణ (బాహుబలి)

ఉత్తమ హాస్య నటుడు… వెన్నెల కిషోర్ (భలె భలెే మగాడివోయ్)

ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్ట్ (ఎస్వీ రంగారావు) అవార్డు… అల్లు అర్జున్ (రుద్రమదేవి)

ఉత్తమ బాల నటుడు… మాస్టర్ ఎన్టీఆర్ (దాన వీర శూర కర్ణ)

ఉత్తమ బాల నటి… బేబీ కారుణ్య (దాన వీర శూర కర్ణ)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్… జ్ఞాన శేఖర్ (కంచె, మళ్ళి మళ్ళి ఇది రాని రోజు)

ఉత్తమ కళా దర్శకుడు… సాబు శిరిల్ (బాహుబలి)

ఉత్తమ కొరియోగ్రాఫర్… ప్రేమ్ రక్షిత్ (బాహుబలి)

ఉత్తమ ఫైట్ మాస్టర్… పీటర్ హెయిన్స్ (బాహుబలి)

ద్వితీయ ఉత్తమ చిత్రం… ఎవడే సుబ్రహ్మణ్యం

తృతీయ ఉత్తమ చిత్రం… నేను శైలజ

ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు… నాగ్ అశ్విన్ (ఎవడే సుబ్రహ్మణ్యం)

స్పెషల్ జ్యూరీ అవార్డు… పీసీ రెడ్డి

2016 అవార్డుల హైలైట్స్

ఉత్తమ చిత్రం…పెళ్ళి చూపులు

ఉత్తమ దర్శకుడు… సతీష్ వేగేశ్న (శతమానం భవతి)

ఉత్తమ నటుడు… జూనియర్ ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్)

ఉత్తమ నటి… రీతూ వర్మ (పెళ్లిచూపులు)

ఉత్తమ విలన్… ఆది పినిశెట్టి (సరైనోడు)

ఉత్తమ సంగీత దర్శకుడు… మిక్కీ జె. మేయర్ (అఆ)

ఉత్తమ గాయకుడు… వందేమాతరం శ్రీనివాస్ష (దండకారణ్యం)

ఉత్తమ గాయని… చిన్మయి (కళ్యాణ వైభోగమే)

ఉత్తమ కథా రచయిత… కొరటాల శివ (జనతా గ్యారేజ్)

ఉత్తమ స్క్రీన్ ప్లే… రవికాంత్, అడవి శేష్ (క్షణం)

ఉత్తమ సహాయ నటుడు… మోహన్ లాల్ (జనతా గ్యారేజ్)

ఉత్తమ సహాయ నటి… జయసుధ (శతమానం భవతి)

ఉత్తమ హాస్య నటుడు… సప్తగిరి (ఎక్స్ ప్రెస్ రాజా)

ఉత్తమ హాస్య నటి… ప్రగతి (కళ్యాణ వైభోగమే)

ఉత్తమ బాల నటుడు… మైఖేల్ గాంధీ (సుప్రీం)

ఉత్తమ బాల నటి… రైనారావ్ (మనమంతా)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్… సమీర్ రెడ్డి (శతమానం భవతి)

ఉత్తమ కళా దర్శకుడు… ఎ.ఎస్. ప్రకాష్ (జనతా గ్యారేజ్)

ఉత్తమ కొరియోగ్రాఫర్… రాజు సుందరం (జనతా గ్యారేజ్)

ద్వితీయ ఉత్తమ చిత్రం… అర్ధనారి

తృతీయ ఉత్తమ చిత్రం… మనలో ఒకడు

ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు… కళ్యాణ్ కృష్ణ కురసాల (సోగ్గాడే చిన్నినాయన)

స్పెషల్ జ్యూరీ అవార్డులు.. నాని (జంటిల్మన్), పరుచూరి బ్రదర్స్.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply