తెలుగుదేశంతో నా అనుబంధం ఎంత చెప్పినా తక్కువే..
కష్టాల్లో ఉన్నప్పుడు మీ కుటుంబ మద్ధతు ఎప్పటికీ గుర్తుంటుంది.
కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలనే..
తెలుగుదేశం కుటుంబంతో నా అనుబంధాన్ని ఎంత వివరించినా తక్కువే. వాస్తవానికి ఈ బంధాన్ని తెంచుకోవడం నాకు గుండెకోతతో సమానం’
తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు రాసిన లేఖలోని రెండు వాఖ్యాలివి. మూడు పేజీల లేఖలో సగం పార్టీపట్ల, అధినేత పట్ల విధేయతను ప్రేమను చాటుకోవడానికి కేటాయించిన రేవంత్ రెడ్డి… మిగిలిన సగంలో కేసీఆర్ కు, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయవలసిన పోరాటం ఆవశ్యకతను వివరించారు. మొత్తంగా తాను పార్టీని వీడటం అనివార్యమని సూత్రీకరించారు.
లేఖలో ఎక్కడా పార్టీలోని ఇతర నేతలను, పార్టీ విధానాలను ఆక్షేపించలేదు. కొద్ది రోజుల క్రితం ఆ దారి ఎంచుకున్న రేవంత్ విమర్శలను ఎదుర్కొన్నారు. రాజీనామా లేఖలో మాత్రం పార్టీ కార్యకర్తలు, అధినేతను ప్రశంసలతో ముంచెత్తారు. కేసీఆర్ అరాచకాలను టీడీపీ ద్వారానే అంతమొందించాలని కోరుకున్నానంటూ.. తెలంగాణలో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్టు చెప్పకుండానే చెప్పారు.
రాజీనామా లేఖలు పార్టీ అధినేతకు సమర్పించి వెళ్లిన తర్వాత రేవంత్ రెడ్డి వాటిని సామాజిక మాథ్యమాల్లో పోస్టు చేశారు.