Read Time:50 Second
దక్షిణ పసిఫిక్ సముద్రంలో మంగళవారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. ఫ్రెంచ్ టెరిటరీ న్యూ కేలెడోనియాలోని టాడైన్ పట్టణానికి తూర్పు దిశగా 126 కిలోమీటర్ల దూరంలో సంభవించిన ఈ భూ కంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. భూకంప కేంద్ర బిందువు సముద్ర మట్టానికి 16.7 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ కనుగొంది. అయితే, ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ స్పష్టం చేసింది.