పార్టీల కార్యాలయాలకోసం స్థలాలు

రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, జాతీయ పార్టీలకు నియోజకవర్గాల స్థాయిలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేందుకు లీజు ప్రాతిపదికన 25 సెంట్ల వరకు ప్రభుత్వ భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏడాదికి రూ.1000 లీజుగా నిర్ణయించింది. కేటాయింపు జరిగిన రెండేళ్లలోపు కార్యాలయాలను నిర్మించాలన్న షరతును మంత్రిమండలి విధించింది.

ఉద్యోగులకు హెచ్‌ఆర్ఏ పెంపు

శ్రీకాకుళం, చిత్తూరు, మచిలీపట్నం జిల్లా కేంద్రాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ ను ప్రస్తుతం ఉన్న 14.5 శాతం నుంచి 20 శాతానికి పెంచడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.  జనాభా ప్రాతిపదికతో సంబంధం లేకుండా ఇంటి అద్దె భత్యాన్ని పెంచేందుకు మంత్రిమండలి అనుమతించింది. దీనివల్ల 22,372 మంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతుంది. ప్రభుత్వంపై ఏటా రూ. 4.11 కోట్ల అదనపు భారం పడుతుంది.

Leave a Comment