పెద్దాపురంలో భారీ అగ్నిప్రమాదం

ప్రమాద స్థలిని పరిశీలించిన హోంమంత్రి చినరాజప్ప

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం లలిత రైస్ మిల్లులో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. మిల్లులోని గోనెసంచుల గోదామునుంచి మంటలు వ్యాపించినట్టు ప్రాథమిక సమాచారం. సుమారు రూ. 4కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేశారు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద రైస్ మిల్లుగా చెబుతున్నారు. ఎనిమిది ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకిి తెచ్చాయి.

ప్రమాద విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని విచారించాల్సి ఉందని ఆయన చెప్పారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తామని చినరాజప్ప ప్రకటించారు.

Related posts

Leave a Comment