ఫార్చ్యూన్ 500 కంపెనీలే లక్ష్యంగా…ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పాలసీ

5 0
Read Time:4 Minute, 20 Second

రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికోసం ప్రభుత్వం మరో నూతన విధానాన్ని రూపొందించింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో రూపొందిన ఇంటిగ్రేటెడ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ పాలసీ 2017-2020కి శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఐటీ రంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు ఆంధ్రప్రదేశ్‌ను వేదిక చేసేందుకు ఈ విధానం దోహదపడుతుందని లోకేష్ ఈ సందర్భంగా చెప్పారు. నూతన విధానంలోని ముఖ్యాంశాలు, లక్ష్యాలు…

 • రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు మార్గం సుగమం.
 • ఫార్చ్యూన్ 500 కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా పాలసీ రూపకల్పన.
 • వాక్ టూ వర్క్ కాన్సెప్టుతో పాలసీ.
 • ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. సాధారణ సాఫ్ట్‌వేర్ సర్వీసులకు కాలం చెల్లడంతో అధునాతన టెక్నాలజిస్‌పై పరిశోధనలు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్న కంపెనీలు.
 • బ్లాక్ చైన్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఐఓటీ, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్, ఫిన్‌టెక్ లాంటి అధునాతన టెక్నాలజిస్ వైపు ప్రత్యేక దృష్టి పెడుతున్న పలు కంపెనీలు. అలాంటి కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ పాలసీ 2017-2020 రూపొందించిన మంత్రి నారా లోకేష్.
 • అధునాతన టెక్నాలజీ అభివృద్ధి కోసం రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే కంపెనీలకు భూ కేటాయింపులు.
 • రాయితీలు, అనుమతులు త్వరితగతిన ఇవ్వడం ద్వారా ఎంప్లాయి హౌసింగ్‌ సహా పూర్తి స్థాయి వ్యవస్థ ఏర్పాటు అయ్యేలా పాలసీ రూపకల్పన.
 • పాలసీలో భాగంగా హై ఎండ్ ఐటి ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చే అవకాశం.
 • పాలసీలో భాగంగా రాయితీలు, ఇతర సదుపాయాలు పొందేందుకు కావాల్సిన అర్హతలు.
  1. ఫార్చ్యూన్ 500 కంపెనీ అయ్యి ఉండాలి.
  2. 250 కోట్ల కనీస పెట్టుబడి ఉండాలి.
  3. గత ఐదు సంవత్సరాల్లో కనీసం 1 బిలియన్ డాలర్ టర్నోవర్ ఉండాలి.
  4. 7 సంవత్సరాల్లో కనీసం 2500 ఉద్యోగాలు కల్పించాలి.
  5. పాలసీలో భాగంగా అభివృద్ధి చేసి మౌలిక వసతులతో కూడిన భూమి నామినల్ ధరకు కేటాయింపు, ఉద్యోగాల కల్పనపై రాయితీ, స్టేట్ జీఎస్టీ రాయితీ, ఫైబర్ కనెక్టివిటీ, సబ్సిడీ ధరకు విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా.
ఏపీ ఫైబర్ నెట్‌వర్క్

ఏపీ ఫైబర్ నెట్‌వర్క్‌లో FSOC (ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ సొల్యూషన్ వ్యవస్థ) ఏర్పాటుకు అవసరమైన డిజైన్, ఇంప్లిమెంటేషన్, మెయింటేనెన్స్ కోసం ఏజెన్సీని ఎంపిక చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ వ్యవస్థ ఏర్పాటు వల్ల 20 కిలోమీటర్ల రేంజ్ వరకు 20 GBPS వేగంతో సుపీరియర్ డేటా ట్రాన్స్‌మిషన్ జరిపేందుకు సామర్ధ్యం కలుగుతుంది. ఈ వ్యవస్థ ద్వారా ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా నిరంతరాయంగా ఏపీ ఫైబర్ సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుంది.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply