పసిఫిక్ మహాసముద్రంలో ఫిజీ దీవులకు దగ్గరగా ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత భూకంప లేఖినిపై 8.2గా నమోదైంది. అయితే, సునామీ అవకాశాలు దాదాపు లేనట్టే. భూకంపం సముద్రం అడుగునుంచి 559.57 కిలోమీటర్ల లోతులో సంభవించడమే ఇందుకు కారణం.
ఈ భూంకప తీవ్రతను తొలుత 7.9గా నమోదు చేశారు. తర్వాత 8.2కు పెంచారు. అంత లోతులో కాకుండా భూ ఉపరితలానికి దగ్గరగా ఇదే స్థాయిలో తీవ్రత నమోదైతే భారీ నష్టం జరిగి ఉండేది. సునామీ సంభవించేది. భూకంపాలకు కేంద్రమైన ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలోనే తాజా భూకంపమూ నమోదైంది.
ఫిజీలోని లెవుకాకు 270 కిలోమీటర్ల తూర్పున, టోంగాకు 443 కిలోమీటర్ల పశ్చిమాన భూ కంప కేంద్ర బిందువు ఉంది.