సామాజిక మాథ్యమాల్లో దిగ్గజమైన ఫేస్ బుక్ అమెరికాలో వెనుకబడింది. వెబ్ సైట్ల ర్యాంకులలో టాప్3 నుంచి ఒక స్థానం తగ్గి తాజాగా నాలుగో ర్యాంకుకు పరిమితమైంది. ఫేస్ బుక్ స్థానాన్ని తాజాగా రెడ్డిట్.కామ్ ఆక్రమించింది. ర్యాంకింగ్ వెబ్ సైట్ అలెక్సా ప్రకారం అమెరికాలో గూగుల్.కామ్, యూట్యూబ్.కామ్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. అలెక్సా.కామ్ సొంతదారైన అమెజాన్.కామ్ ఐదో స్థానంలో ఉండగా వికీపీడియా, యాహూ, ట్విట్టర్, ఇబే, ఇన్స్టాగ్రామ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్, ట్విచ్.టివి, లింక్డ్ ఇన్, ఇమ్గుర్ వరుసగా 11 నుంచి 14వరకు ర్యాంకులను పొందాయి. పోర్న్ హబ్ అమెరికాలో 15వ స్థానంలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఫేస్బుక్.కామ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. గూగుల్.కామ్, యూట్యూబ్.కామ్ ప్రపంచవ్యాప్తంగానూ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. కాగా, చైనాకు చెందిన బైదు.కామ్ నాలుగో స్థానంలో నిలిచింది. వికీపీడియా, రెడ్డిట్, యూహూ 5,6,7 స్థానాల్లో ఉండగా… చైనాకు చెందిన క్యుక్యు.కామ్, టావోబావో.కామ్ 8,9 స్థానాల్లో నిలిచాయి. అమెజాన్.కామ్ ప్రపంచవ్యాప్తంగా 10వ స్థానంలో ఉంది. వెబ్ సైట్ల ట్రాఫిక్ ఆధారంగా అలెక్సా ర్యాంకులను నిర్ధారిస్తుంది.