మంత్రివర్గం భూకేటాయింపులివే…

0 0
Read Time:4 Minute, 42 Second

  • విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పత్తికాయవలసలోని సర్వే నెంబర్ 52/2 నుంచి 52/6, 7/A లోని 9.52 ఎకరాల భూమిని ఎకరానికి రూ. 3 లక్షల 30 వేల చొప్పున ఆహార శుద్ధి పరిశ్రమ నెలకొల్పేందుకు నార్త్ కోస్టల్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేటాయించాలని మంత్రి మండలి నిర్ణయం.
  • శ్రీ గోపాల్ స్టార్చ్ మిల్స్‌, పెద్దాపురానికి చెందిన సర్వే. నెం. 202/3A లోని 4.41 ఎకరాల అసైన్డ్ భూమికి బదులుగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మునిసిపాలిటీ పరిధిలోని 2-1-2/3 లోని 3.30 ఎకరాలు, ఆర్బీ పట్నం గ్రామం సర్వే నెం. 353 లోని 1.15 ఎకరాల వ్యవసాయ భూమిని (మొత్తం 4.45 ఎకరాలు) మార్పిడి చేసుకునేందుకు అనుమతిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
  • చిత్తూరు జిల్లా గంగవరంలోని సర్వే నెం. 242/2 లోని 9.97 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కొసం ఏపీఐఐసి కి అప్పగిస్తూ మంత్రి మండలి నిర్ణయం.
  • చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె గ్రామంలోని సర్వే నెం. 488లోని 20.04 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఏపీ ఐఐసికి అప్పగిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
  • చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ మండలం మంగళం గ్రామంలోని సర్వే నెం. 1/10 లోని ఎకరా భూమిని బి.సి. భవన్ నిర్మాణంకోసం బి.సి. వెల్ఫేర్ డిపార్టుమెంటుకు అప్పగిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
  • చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ మండలం మంగళం గ్రామంలోని సర్వే నెం. 1/10 లోని 4 ఎకరాల భూమిని ఏపీ జ్యుడిషియల్ ఎకాడమీ రీజినల్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి చిత్తూరు వారికి అప్పగిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
  • చిత్తూరు జిల్లా కుప్పం మండలం చిన్నకూరబాలపల్లె గ్రామ పరిధిలో 5.31 ఎకరాల భూమిని పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం కోసం పోలీస్ శాఖకు అప్పగిస్తూ కలెక్టర్ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం.
  • చిత్తూరు జిల్లా సత్యలవేడు మండలం చెరివి గ్రామంలో 6.06 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్, సెజ్ ఏర్పాటు నిమిత్తం జోనల్ మేనేజర్, ఏపీఐఐసికి అప్పగిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
  • చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నాగమంగళం గ్రామంలో సర్వే . నెం 47/ 5 లో 7.44 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్, ఏర్పాటు నిమిత్తం జోనల్ మేనేజర్ ఏపీ ఐఐసిక అప్పగిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
  • చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం కువకోలి గ్రామంలో సర్వే . నెం 313/ 1C1 లో 7.93 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్, ఏర్పాటు నిమిత్తం జోనల్ మేనేజర్ ఏపీ ఐఐసికి అప్పగిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
  • చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం మొలకలదిన్నె గ్రామంలోని సర్వే నుం. 17/1 లోని 24.13 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్, ఏర్పాటు నిమిత్తం జోనల్ మేనేజర్ ఏపీ ఐఐసీకి అప్పగిస్తూ కలెక్టర్ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం.
  • కృష్ణాజిల్లా విజయవాడ ఆటోనగర్ లో ఎల్.పి నెంబర్ 28/86లోని 1500 చ.గజాల భూమిని రీజినల్ ఆఫీస్, లేబొరేటరీ నిర్మించేందుకు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కేటాయిస్తూ విజయవాడ మునిసిపల్ కమిషనర్ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply