మరోసారి మేరీ కోమ్… ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కైవశం

admin

మట్టినుంచి తయారైన మాణిక్యం మేరీకోమ్ ప్రపంచ బాక్సింగ్ యవనికపై మరోసారి తన సత్తా చాటింది. ఆసియా బాక్సింగ్ మహిళల ఛాంపియన్ షిప్ పోటీల్లో 48 కేజీల లైట్ వెయిట్ కేటగిరిలో విజయం సాధించి ఐదోసారి గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది. వియత్నాంలోని హోచిమిన్ సిటీ ఆతిథ్యమిచ్చిన ఆసియా ఛాంపియన్ షిప్ పోటీల్లో భాగంగా… బుధవారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఉత్తర కొరియాకు చెందిన హ్యాంగ్ మి కిమ్ ను ఓడించడం ద్వారా మేరీ కోమ్ మరోసారి ఆసియా పీఠాన్ని దక్కించుకుంది.

34 సంవత్సరాల ఈ భారత స్టార్ బాక్సర్ ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. తాజా ఆసియా ఛాంపియన్ పోటీల్లో తొలినుంచీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో జపాన్ క్రీడాకారిణి సుబాబా కొమురాను ఓడించింది. ఆసియా ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే సామాజిక మాథ్యమాల్లో మేరీ కోమ్ కు అభినందనలు వెల్లువెత్తాయి.

Leave a Reply

Next Post

మీ రాజీనామా... లేదా నా రాజకీయ సన్యాసం

ShareTweetLinkedInPinterestEmailShareTweetLinkedInPinterestEmail

Subscribe US Now

shares