మీ పద్ధతి మారాలి.. లేదంటే…

కార్పొరేట్ కళాశాలలకు సిఎం హెచ్చరిక

కార్పొరేట్ కళాశాలలు విద్యార్ధుల పట్ల అనుసరించాల్సిన వ్యవహారశైలి, విధానాలు, పద్ధతులలో తక్షణమే మార్పులు తీసుకురావాలని, లేదంటే కఠిన చర్యలు తప్పని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. నాలుగైదు రోజుల్లోనే తనకు మార్పు కనపించాలని, ఈ మార్పును ప్రజలు గమనించి వాళ్లల్లో సంతృప్తి వ్యక్తంకావాలని చంద్రబాబు చెప్పారు.

విద్యార్ధుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలోముఖ్యమంత్రి సోమవారం ప్రైవేటు కళాశాలల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విద్యార్ధలు ఆత్మహత్యల నివారణకు తీసుకోవలసిన చర్యలపై చంద్రబాబు కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడారు. అందులో భాగంగా కళాశాలల యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

నెలకు ఒకసారి కమిటీతో, మూడు నెలలకు ఒకసారి అన్ని కళాశాలల ప్రతినిధులతో సమావేశమై పరిస్థితిని తానే స్వయంగా సమీక్షిస్తానని చంద్రబాబు చెప్పారు. విద్యార్ధులను 18 గంటలపాటు చదువుకే పరిమితం చేసే షెడ్యూళ్ళు మారాలని స్పష్టం చేశారు. విద్యార్ధులు మార్కులు తెచ్చే యంత్రాలు కాదన్న సిఎం… నిబంధనలను ఉల్లంఘించిన కళాశాలలపై చర్యలు తప్పవన్నారు.

ఏపీని నాలెడ్జ్ సొసైటీగా తీర్చిదిద్దాలనుకున్నాను కానీ, విద్యార్థుల్ని రోబోలుగా మార్చే ప్రస్తుత కార్పొరేట్ విద్యావిధానాన్ని అస్సలు సహించను’’

కార్పొరేట్ కళాశాలలకు స్వీయ నియంత్రణ ఉండాలని, విద్యార్థుల్ని వేధించే పద్ధతులకు తక్షణం స్వస్తి పలకాలని చంద్రబాబు ఆదేశించారు. మార్పు తీసుకురాకపోతే ఎవరైనా సరే ఉపేక్షించబోనని ఉద్ఘాటించారు. విద్యార్థుల సోషల్ వర్కుకు 5 శాతం మార్కులు తప్పనిసరి చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు.

Related posts

Leave a Comment