Read Time:45 Second
2016 రియో ఒలింపిక్స్ ఛైర్మన్ గా వ్యవహరించిన బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు కార్లోస్ నుజ్ మాన్ అరెస్టయ్యారు. ఒలింపిక్ బిడ్ గెలుచుకోవడానికి ఓట్ల కొనుగోలుకు పాల్పడ్డారన్న అభియోగాన్ని కార్లోస్ ఎదుర్కొన్నారు. బ్రెజిల్ కాల మానం ప్రకారం కార్లోస్ ను గురువారం ఉదయం 6:00 గంటలకు ఆయన నివాసంలోనే అరెస్ట్ చేశారు. కార్లోస్ కుడి భుజంగా భావించే లియోనార్డో గ్రైనర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.