Read Time:13 Minute, 51 Second
రాజధాని అభివృద్ధి ప్రాజెక్టుకోసం కేటాయింపు
రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం
వివిధ జిల్లాల్లో భూ కేటాయింపులు
రాజధాని అమరావతి పరిధిలో గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం 3838.86 ఎకరాల భూమిని క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీయే)కి ఉచితంగా అప్పగించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ AWD పోరంబోకు భూమి రాజధాని ప్రాంతంలోని శాఖమూరు, ఐనవోలు, నేలపాడు, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, నవులూరు గ్రామాల పరిధిలోని ఈ భూమిని సీఆర్డీయే కమిషనర్‌కు అప్పగించాలన్న ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. బుధవారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పలుచోట్ల భూ కేటాయింపులు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలివీ..
- కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడప గ్రామంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు లీజు ప్రాతిపదికపై కేటాయించిన 5 ఎకరాల భూమికి సంబంధించి స్టాంపు డ్యూటీ మినహాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం. ఈ స్థలంలో ‘ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ఎకాడమీ ఫర్ ఐ కేర్ ఎడ్యుకేషన్ అండ్ ఐ కేర్ సెంటర్’ ఏర్పాటుచేస్తున్నారు.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెంలో 14.91 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా నడికూడి-శ్రీకాళహస్తి కొత్త బ్రాడిగేజి లైను నిర్మాణం కోసం సికిందరాబాద్‌లోని వరల్డ్ క్లాస్ స్టేషన్ ప్రాజెక్ట్ డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్‌కు ముందస్తుగా స్వాధీనపరిచే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమెదించింది.
- శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పమిడిపాడు గ్రామంలో సర్వే నెం. 40/2 లో ఉన్న 5.87 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని ఉచితంగా నడికూడి-శ్రీకాళహస్తి కొత్త బ్రాడిగేజ్ లైన్ నిర్మాణం కోసం సికిందరాబాద్‌లోని వరల్డ్ క్లాస్ స్టేషన్ ప్రాజెక్ట్ డిప్యూటీ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్‌కు ముందస్తుగా స్వాధీనపరిచే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాకలకొండ గ్రామం సర్వే నెం. 1,1/16-4A లోని 73.52 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా నడికూడి-శ్రీకాళహస్తి కొత్త బ్రాడిగేజ్ లైన్ నిర్మాణం కోసం సికిందరాబాద్‌లోని వరల్డ్ క్లాస్ స్టేషన్ ప్రాజెక్ట్ డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్‌కు ముందస్తుగా స్వాధీనపరిచే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది.
- శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నబ్బీనగరం గ్రామం పరధిలోని 16-4, 41-2 సర్వే నెంబర్లలో 8.94 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా నడికూడి-శ్రీకాళహస్తి కొత్త బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం కోసం సికిందరాబాద్‌లోని వరల్డ్ క్లాస్ స్టేషన్ ప్రాజెక్ట్ డిప్యూటీ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్‌కు ముందస్తుగా స్వాధీనపరిచే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది.
- శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం రావిపాడు గ్రామం సర్వే నెం. 463-1, సర్వే నెం. 464-2లలోని 8.08 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా నడికూడి-శ్రీకాళహస్తి కొత్త బ్రాడిగేజ్ లైన్ నిర్మాణం కోసం సికిందరాబాద్‌లోని వరల్డ్ క్లాస్ స్టేషన్ ప్రాజెక్టు డిప్యూటీ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్‌కు ముందస్తుగా స్వాధీనపరిచే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది.
- శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 461.85 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా నడికూడి-శ్రీకాళహస్తి కొత్త బ్రాడిగేజ్ లైన్ నిర్మాణం కోసం సికిందరాబాద్‌లోని వరల్డ్ క్లాస్ స్టేషన్ ప్రాజెక్ట్ డిప్యూటీ చీఫ్ మేనేజర్‌కు ముందస్తుగా అప్పగించడానికి జిల్లా కలెక్టర్‌కు అనుమతినిచ్చే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది.
- శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా అన్నసముద్రంపేట మండలం దూబగుంట గ్రామం సర్వే నెంబర్ 421లోని (AWD) 5.92 ఎకరాల భూమిని నడికూడి-శ్రీకాళహస్తి కొత్త బ్రాడిగేజ్ లైన్ నిర్మాణం కోసం సికిందరాబాద్‌లోని వరల్డ్ క్లాస్ స్టేషన్ ప్రాజెక్ట్ డిప్యూటి చీఫ్ మేనేజర్‌కు ముందస్తుగా అప్పగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం కాటేపల్లి సర్వే నెం.1, 5-1 లోని 33.88 ఎకరాల ప్రభుత్వ భూమిని నడికూడి-శ్రీకాళహస్తి కొత్త బ్రాడిగేజ్ లైన్ నిర్మాణం కోసం సికిందరాబాద్‌లోని వరల్డ్ క్లాస్ స్టేషన్ ప్రాజెక్ట్ డిప్యూటి చీఫ్ మేనేజర్‌కు ముందస్తుగా అప్పగించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదించింది.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉచ్చగుంటపాలెంలో సర్వే నెం. 200, 239 లలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏపీఐఐసికి 51.54 ఎకరాల ప్రభుత్వ భూమి (AW Dry land)ని ఉచితంగా కేటాయించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
- చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామ పరిధిలో 38.85 ఎకరాలు, ఎర్రచెర్లోపల్లిలో 22.13 ఎకరాలు, పూతలపట్టు మండలం తలుపులపల్లెలో 15.72 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్కు కోసం ఏపీఐఐసీకి 16.3.17న ఇచ్చిన జీవో నెం.106కు అనుగుణంగా ఏపీఐఐసీకి ఉచితంగా కొన్ని షరతులతో స్వాధీనపరిచేందుకు కలెక్టర్‌కు అనుమతిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది.
- చిత్తూరు జల్లా జీడీ నెల్లూరు మండలం జీడీ నెల్లూరు గ్రామంలో సర్వే నెంబర్ 808/2లో 21.62 ఎకరాల భూమిని ఎంఎస్ ఎంఈ పార్కు స్థాపన కోసం (జీవో నెం.106) ఉచితంగా కేటాయించే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది.
- గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో కంపోస్టు ఎరువు యార్డు ఏర్పాటుకోసం మునిసిపల్ కార్పొరేషన్‌కు, అర్బన్ డెవలప్‌మెంట్ విభాగానికి ఉచితంగా 51.24 భూమిని (AW Land) స్వాధీనపర్చాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. సర్వే నెంబర్ 933లో 6.54 ఎకరాలు, సర్వే నెం. 938లో 8.96 ఎకరాలు, సర్వే నెంబర్ 947లో 6.60 ఎకరాలు, సర్వే నెం. 949లో 3.66 ఎకరాలు, సర్వే నెం. 951లో 7.20 ఎకరాలు, సర్వే నెంబర్ 952లో 16.64 ఎకరాలు, సర్వే నెం. 954లో 1.64 ఎకరాల ప్రభుత్వ (AWD) భూమిని స్వాధీనపర్చే ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది.
- గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఏపీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల కోసం చిలకలూరిపేట మండలం రాజాపేట గ్రామంలో 5 ఎకరాల ప్రభుత్వ (AWD) భూమిని ఏపీఆర్ఈఐకి బదలాయించే ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. సర్వే నెం. 372-BIAలో 19 సెంట్లు, సర్వే నెం. 371- B2B 16లో 2.69 సెంట్లు, సర్వే నెం. 372 B3Aలో 40 సెంట్లు, సర్వే నెం. 480-2లో 1.72 ఎకరాలు వెరసి రాజాపేట గ్రామ పరిధిలోని మొత్తం 5 ఎకరాల భూమిని ఎపీఆర్ఈఐకి అప్పగిస్తారు.
- గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఏపీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల కోసం చిలకలూరిపేట మండలం రాజాపేట గ్రామంలో 5 ఎకరాల ప్రభుత్వ (AWD) భూమిని ఏపీఆర్ఈఐకి బదలాయించే ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. సర్వే నెం. 372—BIA లో 19 సెంట్లు, సర్వే నెం. 371- B2B 16 లో 2.69 సెంట్లు, సర్వే నెం. 372 B3A లో 40 సెంట్లు, సర్వే నెం. 480-2లో 1.72 ఎకరాలు, వెరసి రాజాపేట గ్రామ పరిధిలోని మొత్తం 5 ఎకరాల భూమిని ఎపీఆర్ఈఐకి అప్పగిస్తారు.
- గుంటూరు జిల్లా నరసరావుపేట 1 వ వార్డు బ్లాక్ నెం. 9, సర్వే నెం. 2293 -2Bలో సద్భవ మండప నిర్మాణం కోసం సర్వే నెం. 40 సెంట్ల భూమిని కేటాయించే ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మైనారిటీలకు ఉపయోగపడే ఈ భూమిని ఉచిత ప్రాతిపదికన అప్పగించాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్రవేసింది.
- విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో పెట్రోలియం యూనివర్శిటీ శాశ్వత ప్రాంగణ నిర్మాణం కోసం 201.80 ఎకరాల భూమి ఉచితంగా కేటాయింపు. ఈ భూమిని డైరెక్టర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐసీఈ)కి బదలాయించే ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది.
- అనంతపురం జిల్లా తనకల్ మండలం కోటపల్లి గ్రామంలో టూరిజం ప్రాజెక్టు నిర్మాణం కోసం పర్యాటక శాఖకు 160.36 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
- శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా టి.పి. గూడూరు మండలం ఏడూరు బిట్-2 గ్రామంలో వీజీఆర్ ఆక్వా ఫామ్స్‌కు చెందిన వి. గంగాధర రెడ్డికి ఆక్వా ఫామ్ ఏర్పాటు చేసుకునేందుకు ఎకరం భూమి కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు రూ. 8 లక్షల 50 వేలుగా చెల్లించాలన్న ప్రతిపాదనను ఆమోదించింది.
- విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి, వేమవరం గ్రామాల్లో జక్కంపూడి ఎకనమిక్ టౌన్‌షిప్ నిర్మాణం కోసం 234.56 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు.
- జక్కంపూడి పరిధిలో 153.11 ఎకరాలు, వేమవరం పరిధిలో 81.45 ఎకరాల ప్రభుత్వ భూమి విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు కేటాయింపు. జక్కంపూడి టౌన్‌షిప్ నిర్మాణం కోసం జక్కంపూడి పరిధిలోని భూమిని ఉచితంగా ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం.
- కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్ సంస్థ నెలకొల్పడానికి 21.97 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి ముందస్తు బదలాయింపు. ఇందుకు సంబంధించి కలెక్టర్‌కు అనుమతినిచ్చే ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది.