‘స్వచ్ఛాంధ్ర మిషన్’ నుంచి గజల్ శ్రీనివాస్ తొలగింపు

లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లిన గజల్ శ్రీనివాస్‌ను స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాస్ ను 2017 మే 28న స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. స్వచ్ఛాంధ్ర థీమ్ సాంగ్ ను కూడా గజల్ పాడారు.

మరోవైపు సేవ్ టెంపుల్ సంస్థకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన శ్రీనివాస్, ఆ సంస్థకు చెందిన వెబ్ రేడియోలో పని చేస్తున్న మహిళను వేధించినందుకు అతనిపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. బెయిల్ దరఖాస్తులను తిరస్కరించిన కోర్టు రిమాండ్ కు పంపడంతో.. గజల్ ఇప్పుడు కంజీరకు బదులు జైలు ఊచలు పట్టుకోవలసి వచ్చింది.

లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అతనిని బ్రాండ్ అంబాసిడర్ గా తొలిగిస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

Related posts

Leave a Comment