తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడంకోసం స్విస్ ఛాలెంజ్ విధానంలో అభివృద్ధిదారును ఎంపిక చేయడానికి అవసరమైన ప్రక్రియను చేపట్టేందుకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు అనుమతి ఇస్తూ మంత్రిమండలి నిర్ణయం. ప్రాజెక్టు పూర్తయ్యేవరకు ఎపి యుఐఎఎంఎల్ ను ట్రాన్సాక్షన్ అడ్వయిజర్, ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఏజన్సీగా నియమించే ప్రతిపాదనకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా పౌరులకు మెరుగైన జీవనం అందించడం, ఆధ్యాత్మిక-పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమల నిర్వహణ, శుద్ధ జలాలు, స్వచ్ఛమైన గాలి అందించడం, సౌకర్యవంతమైన ప్రజారవాణా, వైద్యఖర్చులను తగ్గించేలా ఆరోగ్యవంతమైన జీవన విధానం సాకారం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.