హైపర్ లూప్ నెట్ వర్క్ లో అమరావతి

2 0
Read Time:5 Minute, 43 Second

వర్జిన్ హైపర్ లూప్ వన్ ప్లాన్ చేసిన దేశవ్యాప్త హైపర్ లూప్ నెట్ వర్క్ లో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ‘అమరావతి’ చేరింది. ఆంధ్రప్రదేశ్ తోపాటు కర్నాటక, మహారాష్ట్ర రూట్ నిర్మాణ సాధ్యాాసాధ్యాల అధ్యయనానికి అంగీకరించాయని కంపెనీ ప్రకటించింది. 2021నాటికి మూడు హైపర్ లూప్ వ్యవస్థలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న వర్జిన్ హైపర్ లూప్ వన్ కంపెనీ.. ఈ మూడు రాష్ట్రాల అంగీకారాన్ని ఒక ముందడుగుగా ప్రకటించింది.

అమెరికాలోని లాస్ ఏంజలీస్ కేంద్రంగా ప్రారంభమైన స్టార్టప్ కంపెనీ హైపర్ లూప్ వన్ అందులో బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడిగా పెట్టారు. ఈ ఏడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ వెళ్లినప్పుడు హైపర్ లూప్ కంపెనీ అధినేతలు సమావేశమయ్యారు. అక్కడినుంచి రాగానే ముఖ్యమంత్రి.. హైపర్ లూప్ స్టడీకి కొంత భూమిని కేటాయించాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత కంపెనీ ప్రతినిధులు విజయవాడ వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు.

కర్నాటక, మహారాష్ట్ర కూడా అధ్యయనానికి సిద్ధమైన నేపథ్యంలో తాజాగా కంపెనీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. మూడు రాష్ట్రాలతో ఎంఒయులు కుదుర్చుకున్నట్టు అందులో పేర్కొన్నారు. ముంబై, బెంగళూరు, విశాఖపట్నం వంటి ఆర్థిక కేంద్రాలున్న మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు హైపర్ లూప్ నెట్ వర్క్ సాధ్యాసాధ్యాలను, ఆయా ప్రాంతాలపై దాని ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నాయని కంపెనీ తెలిపింది. హైపర్ లూప్ ఆశలు ఆచరణలోకి వస్తే ఈ మూడు రాష్ట్రాల్లోనే 7.5 కోట్ల మంది నివసించే ప్రాంతాలను అనుసంధానించే అవకాశం ఉంది.

ఈ మూడు రాష్ట్రాలలో హైపర్ లూప్ వ్యవస్థలను ఏర్పాటు చేసి అనుసంధానిస్తే… దేశంలోని మేజర్ నగరాలన్నిటికీ రెండు గంటల్లోపు ప్రయాణించేలా జాతీయ నెట్ వర్క్ ను ఇండియా నిర్మించవచ్చని కంపెనీ అభిప్రాయపడింది. ముంబై, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, అమరావతి మధ్య ప్రయాణం, వాణిజ్యం బాగా మెరుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

అమరావతినుంచి…

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం ఇంకా జరగాల్సి ఉంది. దానికి సమాంతరంగా హైపర్ లూప్ రవాణా వ్యవస్థ నిర్మాణం జరిగితే ప్రారంభంనుంచే ప్రయాణం, వాణిజ్యం మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణం జరగాల్సిన ప్రాంతంనుంచి సమీపంలో ఉన్న విజయవాడ విమానాశ్రయానికి వెళ్ళాలంటే గంటన్నర సమయం పడుతోంది. పెద్ద రోడ్లు వస్తే ఇది తగ్గొచ్చు. హైపర్ లూప్ ద్వారా అయితే కేవలం ఐదు నిమిషాల్లో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరవచ్చని కంపెనీ చెబుతోంది.

అమరావతి నుంచి విశాఖపట్నం నగరానికి 27 నిమిషాల్లో, బెంగళూరుకు 45 నిమిషాల్లో చేరుకోవచ్చని, దీనివల్ల రాజధానికి రోజూ ఇతర ప్రాంతాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి కూడా ప్రయాణం సాగించవచ్చని, రాజధాని ప్రాంతంలోనే ఉండవలసిన అవసరం లేదని కంపెనీ అంటోంది. ఇక మహారాష్ట్ర విషయానికొస్తే నిత్యం అత్యంత రద్దీగా ఉండే ముంబై రైళ్ళు రోజూ 76 లక్షల మందిని గమ్య స్థానాలకు చేరుస్తున్నాయట. పూనె-ముంబై మార్గంలో రోజూ 90 వేల కార్లు ప్రయాణిస్తున్నాయి. 140 కిలోమీటర్ల దూరానికి 2 నుంచి 3 గంటలు పడుతోంది. హైపర్ లూప్ ఈ ప్రయాణ సమయాన్ని 14 నిమిషాలకు తగ్గిస్తుందని కంపెనీ చెబుతోంది.

బెంగళూరులోని కోటి మంది జనం ట్రాఫిక్ కారణంగా 60 కోట్ల గంటలు నష్టపోతున్నారట. నగరంలో వాహనాల సగటు వేగం 11 కిలోమీటర్లు మాత్రమే అని అధ్యయనాలు చెబుతున్నాయి. బెంగళూరు నగర కేంద్రాన్ని, ఐటి హబ్స్ ను కలపడంతో పాటు చెన్నైకు కూడా హైపర్ లూప్ వ్యవస్థను అనుసంధానిస్తే ఈ ప్రాంతం ఎకనమిక్ మెగా రీజియన్ గా తయారవుతుందన్నది ప్రణాళికలు వేస్తున్నవారి మాట.

హైపర్ లూప్ ఇండియా నెట్ వర్క్ ప్రణాళిక ఇదీ

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply