12 యూనిట్లుగా పోలవరం విద్యుత్ ప్రాజెక్టు

పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఏర్పాటుచేస్తున్న జలవిద్యుత్ కేంద్ర నిర్మించేందుకు ఏపీ జెన్‌కోకు అనుమతి ఇస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఇక్కడ 12 x 80 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పుతారు.

విద్యుత్ సంస్థలకు ప్రపంచబ్యాంక్ రుణం

‘24×7 అందరికీ విద్యుత్’ పథకం కోసం ట్రాన్స్‌కో, డిస్కాంలు ప్రపంచబ్యాంక్ రుణం పొందేందుకు పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.

డిస్కమ్‌లకు రుణం

తక్కువ వడ్డీకి రుణం అందించే బ్యాంకుల ద్వారా ఏపీ డిస్కమ్‌లు రూ.11,416.36 కోట్ల రుణాలను సమీకరించుకునేందుకు ప్రభుత్వం హామీ ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

ఆర్టీసీకి రుణం 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఏడాదికి 8 శాతం వడ్డీకి రూ.1000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం హామీగా ఉండేందుకు మంత్రిమండలి అంగీకరించింది.

Related posts

Leave a Comment