కేఈ పెళ్ళి మళ్ళీ మళ్ళీ…!

మంత్రిమండలి సమావేశంలో సరదా సంభాషణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీరియస్ ఎజెండా మధ్యలో సరదా సంభాషణలూ సహజం. మంగళవారంనాటి మంత్రివర్గ సమావేశంలోనూ ఇలాంటి ఒక సందర్భం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కెఇ క్రిష్టమూర్తి, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడు మధ్య చోటు చేసుకుంది. బలహీనవర్గాల యువతకు పెళ్ళి కానుకగా రూ. 30 వేలు ఇచ్చే అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు… ఆ మొత్తం సరిపోదని కెఇ అభిప్రాయపడ్డారు. దీనికి స్పందించిన యనమల ’కేఈ మళ్ళీ పెళ్ళి చేసుకుంటారేమో!’ అని చమత్కరించారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ’ఆయనకంటే మీకే ఉత్సాహం ఎక్కువగా ఉన్నట్టుంది’ అని యనమలను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు.

Read More

పెట్టుబడులే లక్ష్యంగా… ఏపీ మంత్రివర్గం భూ కేటాయింపులు (మొత్తం జాబితా)

మంగళవారంనాటి మంత్రివర్గం కేటాయించిన భూములు వివరాలివి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తోంది. తాజాగా మంగళవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలోనూ ఇదే రిపీటైంది. పెద్ద మొత్తంలో చేసిన భూ కేటాయింపులలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఎపిఐఐసి) సింహభాగం పొందింది. దీనికి తోడు రాజధాని అమరావతి పరిధిలో 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 39 వేల కోట్ల) పెట్టుబడి ప్రతిపాదనలతో వచ్చిన వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులను కూడా మంత్రివర్గం ఆమోదించింది. అమరావతిలో భూములు కేటాయించిన సంస్థలలో గోపిచంద్ బ్యాట్మింటన్ అకాడమీ, బ్రహ్మకుమారీ సొసైటీ, నందమూరి బసవ తారక రామారావు మెమోరియల్ కేన్సర్ ఫౌండేషన్, జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (XLRI), LV ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌ ఉన్నాయి. కొత్తగా భూముల కేటాయింపు, ఇతర ప్రతిపాదనలపై మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలివి. కొత్తగా కేటాయింపులు…

Read More

పేద బీసీలకు పెళ్ళి కానుక, ప్రవాసాంధ్రులకో సంక్షేమ విధానం… మంత్రివర్గ నిర్ణయాలు

చంద్రన్న పెళ్ళి కానుక కింద పేద బీసీ జంటలకు రూ. 30 వేలు 201718లో 40 వేల పెళ్ళిళ్ళకు రూ. 120 కోట్లు అవసరం రెండేళ్ళ తర్వాత ’టెన్త్ తప్పనిసరి’ నిబంధన మంత్రివర్గ సమావేశంలో విధానానికి ఆమోదం పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల్లో ’ఔట్ సోర్సింగ్’! ఎంతమంది అవసరమో గుర్తించాలన్న సిఎం రాష్ట్రంలోని బలహీనవర్గాల యువతీ యువకులకు పెళ్ళి సమయంలో రూ. 30 వేల రూపాయలు కానుకగా ఇవ్వాలన్న కొత్త పథకానికి మంగళవారం మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పేద బీసీలలో పెళ్ళికి చట్టబద్ధంగా నిర్దేశించిన వయసు (పురుషులైతే 21 సంవత్సరాలు… మహిళలైతే 18 సంవత్సరాలు) దాటినవారికి ’చంద్రన్న పెళ్ళి కానుక’ పేరిట ఈ మొత్తాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. 2018 జనవరి నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బలహీనవర్గాల యువతీయువకులు…

Read More

తొలి ఆధార్ ఎయిర్ పోర్టుగా ’కియా’

2018 చివరికల్లా ఆధార్ ఎంట్రీ, బయో మెట్రిక్ బోర్డింగ్.. ప్రతి పాయింట్లో పేపర్ టికెట్ చూపక్కర్లేదు

Read More