విద్యార్ధులూ… బాక్సర్లు కావాలి! : ఆత్మహత్యలపై కేటీఆర్ సందేశం

’’ఒక బాక్సర్ ప్రత్యర్ధిని గట్టిగా కొట్టడమే ముఖ్యం కాదు. ప్రత్యర్ధి ఎంత గట్టిగా కొట్టినా తట్టుకొని నిలబడి తిరిగి కొట్టడం చాలా ముఖ్యం. ఆ విల్ పవర్ అలవరుచుకోవాలి’’

తెలంగాణ ఐటీ మంత్రి కె. తారకరామారావు విద్యార్ధులకు ఇచ్చిన సందేశం ఇది. కళాశాలల్లోని విద్యార్ధులు, బయట యువత ఆత్మహత్యల ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఓ సభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం అనివార్యమని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు.

ఇంట్లో తిట్టారని, పరీక్షలోనో… ప్రేమలోనో విఫలమయ్యారని ఆత్మహత్యలకు దిగడం తగదన్నారు. ఒక్క ఇంటర్వ్యూకు హాజరు కాగానే ఉద్యోగం రాలేదని నిరాశపడకూడదని, దాన్ని అనుభవంగా తీసుకొని రెండో ఇంటర్వ్యూకు బాగా సిద్ధం కావాలని సూచించారు.

Share It

Leave a Reply

shares