విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు (వీడియోలు)

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొమ్మిది రోజుల అధికారిక పర్యటనకోసం విదేశాలకు వెళ్ళారు. వేర్వేరు కార్యక్రమాలకోసం అమెరికా, యుఎఇ, లండన్ లలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. అమెరికాలోని అయోావా స్టేట్ యూనివర్శిటీలో ప్రపంచ ఆహార పురస్కార ప్రధాన కార్యక్రమానికి సిఎం హాజరవుతారు. యుఎఇలోని దుబాయ్, అబుదాబి నగరాలలో పెట్టుబడిదారులు, అక్కడి ప్రభుత్వ ముఖ్యులతో సిఎం భేటీ అవుతారు. తర్వాత లండన్ వెళ్ళి నార్మన్ అమరావతిలో శాశ్వత పరిపాలనా నగరికి సంబంధించి నార్మన్ ఫోస్టర్ తుది నమూనాలపై చర్చిస్తారు.

సిఎం టీమ్ విదేశీ పర్యటనకు వెళ్తున్న దృశ్యాలు

ముఖ్యమంత్రి టీమ్ లో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్ణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈవో క్రిష్ణకిషోర్, సిఎం వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు, వ్యక్తిగత భద్రతాధికారి సుబ్బారాయుడు ఉన్నారు.

Share It

Leave a Reply

shares