25 నిమిషాల్లో ప్రత్యర్ధి చిత్తు.. ‘డెన్మార్క్ ఓపెన్’ శ్రీకాంత్ వశం

భారత బ్యాడ్మింటన్ స్టార్ కిిడాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ కైవశం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచులో కొరియాకు చెందిన లీ హ్యూన్ ఇల్ ను కేవలం 25 నిమిషాల్లో చిత్తు చేసి వరుసగా మూడో సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. తనకంటే 12 సంవత్సరాలు పెద్దవాడైన లీపై శ్రీకాంత్ పూర్తి ఆధిపత్యాన్ని చూపి 21-10, 21-5 స్కోరుతో మట్టి కరిపించాడు. ఈ గెలుపుతో శ్రీకాంత్ కు 7.5 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్ లో శ్రీకాంత్ ది ఎనిమిదో స్థానం. ఫైనల్ మ్యాచ్ లో శ్రీకాంత్ తో తలపడిన లీ… సెమీ ఫైనల్ లో ప్రపంచ రెండో ర్యాంకు ఆటగాడు సోన్ వాన్ హోను ఓడించాడు. కానీ, ఫైనల్ లో శ్రీకాంత్ పై పేలవంగా ఆడాడు.…

Read More

కాబోయే సిఎం… రేవంత్ రెడ్డి కొడంగల్ సమావేశ స్వరమిది!

కార్యకర్తల నినాదాలు.. రేవంత్ ప్రసంగంలో నర్మగర్భ వ్యాఖ్యలు.. పత్రికా వార్తలన్నిటినీ ఖండిస్తున్నట్టు ప్రకటన.. నాయకుడి నమ్మకాన్ని వమ్ము చేయబోనని ఉద్ఘాటన

Read More

రూ. 50 వేలకు మించి డిపాజిట్ చేస్తారా.. ఒరిజినల్ ఐడీ తప్పనిసరి

మీరు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్తున్నారా? డిపాజిట్ చేసే మొత్తం రూ. 50,000కు మించి ఉంటే ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలి. ఇకపైన మీ గుర్తింపును నిర్ధారించే ఒరిజినల్ డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్ళాల్సిందే. కేంద్ర ప్రభుత్వం తాజాగా విధించిన నిబంధన ఇది. మనీ లాండరింగ్ నిరోధక నిబంధనలను సవరిస్తూ కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ శాఖ ఈమేరకు గజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అకౌంట్ ప్రారంభించేవారినుంచి, రూ. 50 వేలకు మించి లావాదేవీలు చేసేవారి నుంచి ఆధార్ నెంబర్, ఇతర అధికారిక పత్రాలు తీసుకోవడం బ్యాంకులకు తప్పనిసరి. స్టాక్ బ్రోకర్లు, చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీలు, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు కూడా ఈ నిబంధనలను పాటించాలి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ), దానికి అనుబంధంగా వచ్చిన…

Read More

ఏపీలో ఏరోసిటీ

5.5 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఏవియేషన్ సిటీ ఎల్ ఎల్ పీ సంసిద్ధత.. పూర్తయితే 15,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి.. ముఖ్యమంత్రి దుబాయ్ పర్యటనలో కంపెనీతో ఇడిబి ఎంఒయు

Read More

ఎమిరేట్స్‌కు ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ హబ్‌గా ఏపీ

అమరావతి, విశాఖ, తిరుపతి నగరాలు దుబాయ్‌కి అనుసంధానం ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ ఎగ్జిక్యూటివ్‌లతో సీఎం భేటీ ఆంధ్రప్రదేశ్‌ను ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ హబ్‌గా చేసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమిరేట్స్ విమానయాన సంస్థలకు సూచించారు. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమిరేట్స్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇంచార్జ్ అద్నాన్ ఖాజిమ్, ఫ్లై దుబాయ్ సీఈఓ ఘయిత్ అల్ ఘయిత్ లతో సమావేశమయ్యారు. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్సు, రిపేర్, ఓవర్ హల్ సదుపాయాలను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక విమానాశ్రయాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.   ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా మధ్య ప్రాచ్య, దక్షిణాసియాలకు మధ్యలో ఉందని చంద్రబాబు చెప్పారు. అమరావతి, విశాఖ, తిరుపతి నగరాలను దుబాయ్ కి అనుసంధానం చేయవచ్చని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎమిరేట్స్ హబ్‌గా తీర్చిదిద్దటం ద్వారా ఉభయ దేశాల స్నేహబంధం…

Read More