కొత్త డిజైన్లు ఓకేనా…!

అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లు లండన్ లో ప్రదర్శన.. నార్మన్ ఫోస్టర్ టీమ్ తో సిఎం చంద్రబాబు భేటీ.. చర్చల్లో సినీ దర్శకుడు రాజమౌళి

Read More

గురువారంభం వాయిదా! నవంబర్ 6 నుంచి జగన్ పాదయాత్ర

నవంబర్ 2. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించవలసిన రోజు. తెల్లవారితే శుక్రవారం. గురువారం ఆరంభిస్తే మరుసటి రోజే బ్రేకు వేసి… కోర్టుకు హాజరు కాక తప్పని పరిస్థితి. ఈ అనివార్యత రీత్యా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర ప్రారంభ తేదీని మార్చారు. గురువారానికి బదులు తర్వాత వచ్చే సోమవారం (6వ తేదీన) పాదయాత్రను ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వాయిదా పడటం ఇదే మొదటిసారి కాదు. అయితే, ఈసారి వాయిదా కోర్టు తీర్పు నేపథ్యంలో అనివార్యమైంది. వచ్చే ఎన్నికలకోసం పార్టీని సమాయత్తం చేయడం, ప్రజల్లో ఆదరణ పెంచుకోవడం లక్ష్యాలుగా జగన్మోహన్ రెడ్డి ఆర్నెల్ల పాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఇడుపుల పాయలోని తమ వ్యవసాయ క్షేత్రంలో తండ్రి సమాధినుంచి మొదలుపెట్టి ఇఛ్చాపురం వరకు పాదయాత్ర చేయాలని జగన్ సంకల్పించారు.…

Read More

రేవంత్ రెడ్డిపై వేటు..! రమణ స్పష్టమైన సంకేతాలు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీడీపీ అధిష్ఠానం చర్యలు తీసుకోనుందా? ఆ పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటనలు, మీడియాతో చెప్పిన విషయాలు ఈ దిశగా ఇస్తున్న సంకేతాలుగా కనిపిస్తున్నాయి. రమణ మంగళవారం ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ నియమావళిని అతిక్రమించినవారిపై వేటు తప్పదని హెచ్చరించారు. పార్టీ (జాతీయ) అధ్యక్షుని అనుమతి లేకుండా ఇతర పార్టీల నేతలను కలవడం తప్పని కూాడా స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను కలసిన విషయమై స్పష్టమైన వివరణ కోరినట్టు వెల్లడించిన రమణ, ఇవ్వకపోతే బాధ్యతలనుంచి తప్పిస్తామని స్పష్టం చేశారు. ’మా పార్టీ నేతలు క్రమశిక్షణను ఉల్లంఘిస్తే పార్టీ క్రమశిక్షణా సంఘం ద్వారా నోటీసులు ఇస్తాం. వారు వివరణ ఇవ్వాల్సిందే’ అని రమణ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గత వారం ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు…

Read More