తిరుపతిలో సైన్స్ సిటీ… మంత్రి మండలి నిర్ణయం

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో సైన్స్ సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోసం ఇప్పటికే 70.11 ఎకరాల భూమిని తిరుపతిలో గుర్తించారు. బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో తిరుపతి సైన్స్ సిటీకి ఆమోద ముద్రపడింది. తిరుపతి సైన్స్ సిటీపై సంక్షిప్తంగా… • సైన్స్ సిటీ మ్యూజియం, పరిశోధనశాల, అవుట్ డోర్ సైన్స్ పార్క్, కన్వెన్షన్ సెంటర్ ఇందులో ఉంటాయి. • ఈ సైన్స్ సిటీ భారతదేశానికి ఒక రోల్ మోడల్‌గా ఉండబోతోందని అధికారులంటున్నారు. • భారతదేశంలో భవిష్యత్తులో జరగబోయే శాస్త్ర ప్రయోగాలు, సాంకేతిక ఆవిష్కరణలకు ఈ సైన్స్ సిటీని హబ్‌గా మార్చాలన్నది ప్రభుత్వ ప్రయత్నం. • కేంద్ర శాస్త్ర పరిశోధన మంత్రిత్వశాఖ నుంచి ఈ సైన్స్ సిటీ ఏర్పాటుకు తగిన ప్రోత్సాహం లభిస్తుందని రాష్ట్ర మంత్రిమండలి…

Read More

ప్రాజెక్టులకోసం… మార్కెట్ రుణాలపై పరిమితి తొలగింపు!

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ రుణానికి గ్యారంటీ

Read More

రష్యన్ సూపర్ ఉమన్…! బాంబు పేలుళ్ళ మధ్య నడక

యుద్ధ భూమిలో బాంబులు పేలుతుంటే ఎవరైనా తాపీగా వాటి ప్రక్కనే నడుచుకుంటూ వస్తారా?  మంగళవారం రష్యాలో ఓ సూపర్ మహిళ ఆ పని చేసింది! అయితే అది నిజంగా యుద్ధభూమి కాదు. పేలుళ్ళను సైతం తట్టుకునేలా రూపొందించిన వస్త్రాలను పరీక్షించడంకోసం సృష్టించిన యుద్ధ సన్నివేశం. పెద్ద శబ్దంతో బాంబులు పేలుతున్నా… మంటలు చుట్టుముట్టినా ఆ మహిళకు ఏం కాలేదు. ఆమె కూడా ఏమాత్రం తొణక కుండా పేలుళ్ళు, మంటల మధ్యనుంచి తాపీగా నడుచుకుంటూ రావడం విశేషం. ఇంతకూ ఆమె ఎవరంటారా? యుద్ధంలో పాల్గొనే సైనికురాలు మాత్రం కాదు. రష్యన్ మోడల్ విక్టోరియా కొలెస్నికోవా. తలనుంచి కాలి మునివేళ్లదాకా అత్యాధునిక సూట్ ధరించి పేలుళ్ళ మధ్య నడిచిన ఆమెకు ముఖంపై కొద్దిగా మసి మాత్రమే అంటింది. విక్టోరియా బాంబుల మధ్య నడుచుకుంటూ వస్తుంటే ఉత్కంఠతో చూసిన జర్నలిస్టులతో ఆమె ఏమన్నారంటే..…

Read More