పరిశీలనలో వడ్డీ మాఫీ, పంటల బీమా ప్రీమియం మినహాయింపు
Read MoreDay: January 27, 2019
‘‘కుంభమేళా’’లో యూపీ కేబినెట్ మీటింగ్
29న నిర్వహణకు సిఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం పీఠాధిపతి స్థానంనుంచి ముఖ్యమంత్రి అవతారమెత్తిన యోగి ఆదిత్యనాథ్ స్టైలే వేరు. ఈసారి ఆయన తన కేబినెట్ సమావేశాన్ని కుంభమేళా స్థలిలో నిర్వహించాలని నిర్ణయించి ఆసక్తిని రేపారు. ఈ నెల 29వ తేదీన ఉత్తరప్రదేశ్ కేబినెట్ సమావేశం అలహాబాద్ నగరంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సహచర మంత్రివర్గ సభ్యులతో కలసి నదిలో స్నానమాచరించనున్నట్టు సమాచారం. యూపీ కేబినెట్ సమావేశం ఇలా జరగనుండటం ఇదే తొలిసారి. కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే యూపీ కేబినెట్ సమావేశం 29వ తేదీ ఉదయం 10.30 గంటలకు జరగనుంది.
Read More