‘5 ట్రిలియన్లు’ కలేనా..?! జీడీపీ ర్యాంకుల్లో 7వ స్థానానికి జారిన ఇండియా

2024 నాటికి ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా పరిణతి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి బీజేపీ గల్లీ నేతల వరకు ఊరూరా చెబుతున్నారు. రెండోసారి గెలిచాక మోదీ తన ప్రధాన లక్ష్యం ఇదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించే పరిస్థితులున్నాయా? అన్న ప్రశ్నకు సంతృప్తికర సమాధానలకంటే సందేహాలే ఎక్కువగా వినవస్తున్నాయి. 2025 నాటికి ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల (రూపాయల్లో 350 లక్షల కోట్ల) ఎకానమీ కావాలంటే స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) సగటున 8 శాతం పైనే వృద్ధి చెందాల్సి ఉంటుందని ప్రభుత్వమే చెప్పింది. మరి ఆరేళ్ళపాటు అంత వృద్ధి రేటు సాధ్యమవుతుందా? ఇండియా వృద్ధి రేటు మందగమనం దిశగా సాగుతోందని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తున్నాయి. నిన్న (ఆగస్టు 1న)…

Read More