2020 టి20 ప్రపంచ కప్ షెడ్యూళ్లివే

2 0
Read Time:3 Minute, 57 Second
పురుషుల, మహిళల టోర్నీలు ఆస్ట్రేలియాలోనే..
ఇండియా మహిళల తొలి పోటీ ఆస్ట్రేలియాతో…
పురుషుల టి20 తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో…

2020లో ఆస్ట్రేలియాలో జరగనున్న టి20 ప్రపంచ కప్ టోర్నీల షెడ్యూలును ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. పురుషుల, మహిళల టి20 ప్రపంచ కప్ పోటీలు ఈసారి ఒకే ఏడాది ఒకే దేశంలో జరగడం విశేషం. ముందుగా మహిళల టి20 టోర్నీ 2020 ఫిబ్రవరి 21వ తేదీనుంచి మార్చి 8వ తేదీ వరకు జరగనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ఫైనల్ మ్యాచ్ ఏర్పాటు చేశారు.

పురుషుల టి20 ప్రపంచ కప్ పోటీలు అక్టోబర్ 18న ప్రారంభమై నవంబర్ 15న ముగియనుంది. అక్టోబర్ 18 నుంచి 23 వరకు క్వాలిఫయర్ మ్యాచులు, ఆ తర్వాత గ్రూప్ మ్యాచులు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 15న జరుగుతుంది. మహిళల టోర్నీలో ఇండియా గ్రూప్ ఎ లో ఉండగా, పురుషుల టోర్నీలో బి గ్రూపులో ఉంది.

పురుషుల ప్రపంచ కప్ లో ఇండియా తొలి మ్యాచులో దక్షిణాఫ్రికాను ఎదుర్కోవలసి ఉంది. కాగా, మహిళల టీమ్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య దేశం ఆస్ట్రేలియాతో తలపడనుంది. మొత్తంగా 10 మహిళా టీములు 23 మ్యాచులు ఆడనున్నాయి. పురుషుల ప్రపంచ కప్ లో మొత్తం 16 టీములు, 45 మ్యాచులు ఆడనున్నాయి.

పురుషుల కప్ లో క్వాలిఫయర్ మ్యాచులు ముగిసిన తర్వాత జరిగే సూపర్ 12 పోటీలలో తొలిగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ తలపడనున్నాయి. పురుషుల సెమీ ఫైనల్ మ్యాచులు నవంబర్ 11, 12 తేదీల్లోనూ..మహిళల సెమీ ఫైనల్స్ మార్చి 5వ తేదీన జరగనున్నాయి.

పురుషుల టి20లో ఎవరే గ్రూపు

గ్రూపు ఎ : పాకిస్తాన్, ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్, న్యూజీలాండ్, మరో 2 క్వాలిఫయర్ టీములు.

గ్రూపు బి : ఇండియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆప్ఘనిస్తాన్, మరో 2 క్వాలిఫయర్ టీములు.

పురుషుల టి 20 షెడ్యూలు

క్వాలిఫయర్ మ్యాచులు : అక్టోబర్ 18 – 23

గ్రూపు దశ మ్యాచులు : అక్టోబర్ 24 – నవంబర్ 8

సెమీ ఫైనల్స్ : నవంబర్ 11, 12

ఫైనల్ మ్యాచ్ : నవంబర్ 15

మహిళల టి20లో ఎవరే గ్రూపు

గ్రూపు ఎ : ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఇండియా, శ్రీలంక, ఒక క్వాలిఫయర్ టీమ్.

గ్రూపు బి : ఇంగ్లండ్, వెస్ట్ ఇండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఒక క్వాలిఫయర్ టీమ్.

మహిళల టి20 ప్రపంచ కప్ షెడ్యూలు

గ్రూపు మ్యాచ్ లు : ఫిబ్రవరి 21 – మార్చి 3

సెమీ ఫైనల్స్ : మార్చి 5

ఫైనల్ మ్యాచ్ : మార్చి 8

అద్భుతమైన ఆస్ట్రేలియా క్రికెట్ మైదానాలలో నిర్వహించే రెండు టి 20 ప్రపంచ్ కప్ పోటీలు ఈసారి మరింతమందికి కనుల విందు చేస్తాయని ఐసీపీ భావిస్తోంది. సిడ్నీ, మెల్ బోర్న్, అడిలైడ్, పెర్త్, బ్రిస్బేన్, గీలాంగ్, హోబర్ట్ నగరాలు ప్రపంచ కప్ మ్యాచులకు ఆతిధ్యమివ్వనున్నాయి.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %