25 నిమిషాల్లో ప్రత్యర్ధి చిత్తు.. ‘డెన్మార్క్ ఓపెన్’ శ్రీకాంత్ వశం

భారత బ్యాడ్మింటన్ స్టార్ కిిడాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ కైవశం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచులో కొరియాకు చెందిన లీ హ్యూన్ ఇల్ ను కేవలం 25 నిమిషాల్లో చిత్తు చేసి వరుసగా మూడో సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. తనకంటే 12 సంవత్సరాలు పెద్దవాడైన లీపై శ్రీకాంత్ పూర్తి ఆధిపత్యాన్ని చూపి 21-10, 21-5 స్కోరుతో మట్టి కరిపించాడు. ఈ గెలుపుతో శ్రీకాంత్ కు 7.5 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది.

ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్ లో శ్రీకాంత్ ది ఎనిమిదో స్థానం. ఫైనల్ మ్యాచ్ లో శ్రీకాంత్ తో తలపడిన లీ… సెమీ ఫైనల్ లో ప్రపంచ రెండో ర్యాంకు ఆటగాడు సోన్ వాన్ హోను ఓడించాడు. కానీ, ఫైనల్ లో శ్రీకాంత్ పై పేలవంగా ఆడాడు. మొదట 4-4 తో ధీటుగా కనిపించినా ఆ తర్వాత గేమంతా ఏకపక్షంగా సాగింది. రెండో గేమ్ అయితే ప్రారంభం నుంచే శ్రీకాంత్ ధాటికి లీ నిలువలేకపోయాడు.

 

Related posts

Leave a Comment