5 జిల్లాల్లో పీపీపీ మోడ్‌లో తాగునీటి ప్రాజెక్టు

2 0
Read Time:2 Minute, 43 Second
మంత్రి మండలి నిర్ణయం

ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందించే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 5 జిల్లాలకు పీపీపీ మోడ్‌లో తాగునీటి ప్రాజెక్టులు చేపడతారు. మరో 8 జిల్లాలకు ప్రభుత్వ, బ్యాంకు నిధుల ద్వారా ప్రాజెక్టులు చేపడతారు.

• ఆంధ్రప్రదేశ్ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పోరేషన్ ద్వారా కడప, కర్నూలు, అనంతపురము, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో రూ.9,400 కోట్లతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో హైబ్రీడ్ యాన్యుటీ మోడ్‌లో తాగునీటి ప్రాజెక్టు చేపట్టేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
• ఈ పథకం ద్వారా 5 జిల్లాలలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కలుగుతుంది.
• రోజుకు ప్రతి ఇంటికి 70 LPCDల నీరు అందుతుంది. పంచాయతీలకు బల్క్ వాటర్ అందించడానికి వీలు కలుగుతుంది. ప్రామాణాలకు అనుగుణంగా శుద్ధమైన తాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది.
• ఈ 5 జిల్లాలలోని మొత్తం 23,495 హ్యాబిటేషన్స్ దీని వల్ల శుద్ధ తాగునీరు అందుతుంది.

8 జిల్లాలలో ప్రభుత్వ నిధులు, ప్రభుత్వరంగ బ్యాంకు నిధుల ద్వారా తాగునీటి ప్రాజెక్టు

• మరో 8 జిల్లాలలో (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో తాగునీటి ప్రాజెక్టులు చేపట్టేందుకు రూ.5,330 కోట్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి నిధులు సేకరించేందుకు మంత్రిమండలి ఆమోదం.
• మొత్తం రూ.6,330 కోట్లు వ్యయం కానున్న ఈ ప్రాజక్టుకు రూ. 1000 కోట్లు ప్రభుత్వం సమకూర్చనుంది.
• దీని వల్ల ఈ 8 జిల్లాలలో రూ.13,289 హ్యాబిటేషన్లకు, అంటే 38 లక్షల ఇళ్లకు ప్రయోజనం కలుగుతుంది.
• పటిష్టమైన పైపులైను ద్వారా నాణ్యమైన ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ అందించడం జరుగుతుంది.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply