బి.ఎస్.ఎఫ్. అధికారి, భార్య ‘విదేశీయులే’: అస్సాం ట్రిబ్యునల్ నిర్ధారణ

admin

అస్సాం ఫారెనర్స్ ట్రిబ్యునళ్ల గుడ్డి తీర్పులకు మరో ఉదాహరణ ఇది. బి.ఎస్.ఎఫ్. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ముజిబుర్ రెహ్మాన్, ఆయన భార్య విదేశీయులని తేల్చింది ఆ రాష్ట్రంలోని జోర్హాట్ పట్టణంలోని ట్రిబ్యునల్. రెహ్మాన్ ప్రస్తుతం బిఎస్ఎఫ్ లో పంజాబ్ రాష్ట్రంలో పని చేస్తున్నారు. జూలై చివరి వారంలో ఆయన సెలవుపై అస్సాం వచ్చినప్పుడు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.1923 నుంచి భూమి డాక్యుమెంట్లు ఉన్న తనలాంటి ఒక నిజమైన భారతీయుడిని […]

6.2 శాతమే : ఇండియా వృద్ధి రేటుపై ‘మూడీస్’

admin

దేశంలో అనేక రంగాల్లో అమ్మకాలు క్షీణించాయని వార్తలు రోజూ వస్తున్న నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి)పై షాకింగ్ వార్త. 2019 కేలండర్ సంవత్సరంలో భారత జీడీపీ కేవలం 6.2 శాతం పెరుగుతుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ తాజా అంచనాలో పేర్కొంది. ఇంతకు ముందు తానే వేసిన అంచనా (6.8 శాతం) నుంచి గణనీయంగా తగ్గించడం గమనార్హం.2020 కేలండర్ సంవత్సరంలోనూ తన అంచనాను తగ్గించిన ‘మూడీస్’, వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి […]

‘పార్లే’ నుంచి 10,000 ఉద్యోగాలు పోతున్నాయ్!

admin

ఇండియాలో బిస్కట్ తయారీదారుల్లో దిగ్గజం పార్లే ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడా కంపెనీ బిస్కట్ల అమ్మకాలు తగ్గిపోవడంతో ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు ఓ అధికారి బుధవారం చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోవడంతో ఉత్పత్తిని తగ్గించినట్టు ఆయన చెప్పారు.ఆసియాలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండియాలో ఇప్పుడు పలు రంగాలు తిరోగమనంలో ఉన్నాయి. కార్ల నుంచి దుస్తులవరకు అమ్మకాలు పడిపోయాయి. కంపెనీలు ఉత్పత్తి […]

మోటారు పరిశ్రమ సంక్షోభం: 1,500 మందిని తొలగించిన ఎం&ఎం

admin

దేశంలో మోటారు పరిశ్రమ సంక్షోభంలో పడింది. గత 19 సంవత్సరాల్లో చూడని విధంగా జూలైలో అమ్మకాలు ఏకంగా 18.71 శాతం తగ్గాయి. గత రెండు, మూడు నెలల్లో 15 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని అంచనా. ఈ నేపథ్యంలో… భారత మోటారు పరిశ్రమలో దిగ్గజ సంస్థ మహింద్రా & మహింద్రా తాత్కాలిక ఉద్యోగులను ఇంటికి పంపుతోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా తమ కంపెనీ 1,500 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించినట్టు […]

‘5 ట్రిలియన్లు’ కలేనా..?! జీడీపీ ర్యాంకుల్లో 7వ స్థానానికి జారిన ఇండియా

admin

2024 నాటికి ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా పరిణతి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి బీజేపీ గల్లీ నేతల వరకు ఊరూరా చెబుతున్నారు. రెండోసారి గెలిచాక మోదీ తన ప్రధాన లక్ష్యం ఇదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించే పరిస్థితులున్నాయా? అన్న ప్రశ్నకు సంతృప్తికర సమాధానలకంటే సందేహాలే ఎక్కువగా వినవస్తున్నాయి. 2025 నాటికి ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల (రూపాయల్లో 350 లక్షల కోట్ల) […]

అంగారకుడి అందం.. హబుల్ తాజా చిత్రం

admin

హబుల్ టెలిస్కోప్ ఈ ఏడాది జూన్ 27వ తేదీన తీసిన జూపిటర్ చిత్రం ఇది. సౌర కుటుంబంలోని అతి పెద్ద గ్రహమైన అంగారకుడిపై ప్రత్యేకమైన ‘గ్రేట్ రెడ్ స్పాట్’ ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. అంగారకుడిపైన అతలాకుతలంగా ఉండే వాతావరణంలో మేఘాల కదలికలు హబుల్ వీడియోలో నిక్షిప్తమయ్యాయి. అంగారకుడి రంగులు, అవి మారే తీరు అధ్యయనం చేస్తున్నవారికి కొత్త క్లూలు అందిస్తున్నాయి. అంగారకుడిపై గ్రేట్ రెడ్ స్పాట్ మన భూమి […]

Subscribe US Now