Read Time:1 Minute, 5 Second
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకోసం బిజెపి తొలి జాబితాను వెల్లడించింది. మొత్తం 70 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన బుధవారం సమావేశమైన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి) ఈ పేర్లను ఖరారు చేసింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ఇతర కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో ఆమోదించిన పేర్లతో శుక్రవారం బిజెపి కేంద్ర కమిటీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. గుజరాత్ ఉపముఖ్యమంత్రి వాటిని మీడియా ఎదుట వెల్లడించారు.